తమిళనాడులో సీజ్‌ చేసిన బంగారం ఎవరిది?

19 Apr, 2019 03:23 IST|Sakshi

వెంటనే విచారణ జరిపి.. వాస్తవాలను బయటపెట్టాలి 

వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్‌  

సాక్షి, హైదరాబాద్‌: తమి ళనాడు పోలీసులు బుధ వారం సీజ్‌ చేసిన బంగారం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి, వాస్తవా లను ప్రజల ముందుం చాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్‌ చేశారు. ఆమె గురువారం హైదరాబాద్‌లో పార్టీ కేంద్ర కార్యాల యంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. బంగారం పట్టివేత వ్యవహారంలో ప్రజలు పూర్తి వివరాలను కోరుకుంటున్నారని చెప్పారు. సీజ్‌ చేసిన దాదాపు 1,400 కిలోల బంగారం తిరుమల తిరుపతి దేవస్థానానికి(టీటీడీ) సంబంధించిందనే వార్తలు వస్తున్నాయని గుర్తుచేశారు. దీనిపై టీటీడీ చైర్మన్, ఈవో, ఇతర అధికారులు నోరు మెదపకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు.
(చదవండి : ఆ బంగారంపై అన్నీ అనుమానాలే)

అనధికారికంగా తరలిస్తున్నారా? 
‘‘భారీస్థాయిలో బంగారం పట్టుబడితే, అది టీటీడీది అని ఎస్పీ ధ్రువీకరిస్తే, ఇక్కడ ఈవో, చైర్మన్, అధికారులు ఎందుకు మాట్లాడడం లేదు? ఇందులో ఏం మతలబు ఉందో అర్థం కావడం లేదు. టీటీడీ బంగారాన్ని రక్షణ లేకుండా, ధ్రువపత్రాలు లేకుండా తరలిస్తున్నారంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? భక్తులు సమర్పించే బంగారం, నిధులకు లెక్కాపత్రం లేకపోవడం ఏమిటి? అనే సందేహాలు భక్తు ల్లో తలెత్తుతున్నాయి. అందుకే విచారణ  జరపాలి’’ అని వాసిరెడ్డి పద్మ డిమాండ్‌ చేశారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా