న్యూయార్క్‌ సదస్సులో జహీరాబాద్‌ కుర్రోడు

14 Aug, 2017 01:44 IST|Sakshi
న్యూయార్క్‌ సదస్సులో జహీరాబాద్‌ కుర్రోడు
జహీరాబాద్‌: తెలంగాణ బిడ్డ సాయిప్రణీత్‌రెడ్డి న్యూయార్క్‌ సదస్సులో ప్రసంగించారు. ఈ నెల 9 నుంచి 12 వరకు న్యూయార్క్‌లో నిర్వహించిన ‘సమ్మర్‌ యూత్‌ అసెంబ్లీ– 2017’ సదస్సులో మన దేశం తరఫున పాల్గొని యువత ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లను ప్రస్తావించారు. యువతలో ప్రావీణ్యం ఉన్నప్పటికీ తగిన ఉద్యోగ అవకాశాలు లభించడం లేదని తెలిపారు.

పేదరికం ఉత్తమ విద్యార్జనకు అడ్డు కాకూడదని పేర్కొన్నారు. యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. చివరి రోజున జరిగిన సదస్సులో సాయిప్రణీత్‌రెడ్డి భారత దేశ సంస్కృతి, ఔన్నత్యాన్ని తన ప్రసంగంలో చాటి చెప్పారు. దేశ, రాష్ట్ర సంస్కృతిని చాటే చేనేత వస్త్రాలను ధరించి హాజరయ్యాడు. సదస్సులో భాగంగా పలువురు ప్రముఖులను ఆయన కలుసుకున్నాడు. సాయిప్రణీత్‌రెడ్డి కోహీర్‌ మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన వాడు. 
మరిన్ని వార్తలు