జీరో.. మారో!

26 Nov, 2014 03:43 IST|Sakshi
జీరో.. మారో!

సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లాలో జీరోదందా జోరుగా సాగుతోంది. రైతులు పండించిన వరిధాన్యాన్ని మార్కెట్‌యార్డుకు రాకుండా నేరుగా రైస్‌మిల్లులకు తరలిస్తున్నారు. తద్వారా కొందరు వ్యాపారులు భారీగా పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారు. రైతులకు మాయమాటలు చెప్పి తూకం విషయంలో మోసం చేస్తున్నారు. ఇవన్నీ తెలిసినా మార్కెటింగ్ శాఖ అధికారులు మామూళ్ల మత్తులో మౌనం దాల్చుతున్నారు. జిల్లాలో ఈ ఖరీఫ్‌లో వరి 1,00,170 హెక్టార్లలో సాగుచేయగా.. ఇప్పుడిప్పుడే నూర్పిళ్లు చేస్తున్నారు.

జిల్లాలో మొత్తం వరి దాదా పు ఎనిమిది లక్షల టన్నుల దిగుబడి వ చ్చే అవకాశముంది. ధాన్యం ఇప్పుడిప్పు డే మార్కెట్లకు రావడం ఆరంభమైం ది. వరికి ప్రభుత్వం రూ.1310 మద్దతు ధర ప్రకటించింది. ధాన్యం కొనుగోళ్ల కోసం జిల్లాలో 18 మార్కెట్‌యార్డులు ఉన్నా యి. ఇవే కాకుండా వరి కొనుగోళ్ల కోసం ప్రభుత్వం 72 చోట్ల ఐకేపీ, ఇతర చోట్ల పీ ఏసీఎస్, హాకా వంటి సంస్థలు కొనుగో లు చేసేలా చర్యలు తీసుకుంది. ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని కలిపి కూడా ఇప్పటివరకు కేవలం 18వేల క్వింటాళ్లు మాత్ర మే కొనుగోలు చేశారు.

అదే ప్రైవేట్ మి ల్లర్లు మాత్రం మార్కెట్‌తో సంబంధం లేకుండా రెండు లక్షల క్వింటాళ్లను కొనుగోలు చేసినట్లు సమాచారం. దీన్నిబట్టి జి ల్లాలో ఏమేర వరిధాన్యం పక్కదారిపడుతుందో అర్థమవుతుంది. ధాన్యం మార్కె ట్ పరిసరాల్లోకి రాకపోవడంతో మార్కె ట్ కేంద్రంగా పనిచేస్తున్న హమాలీలు, ద డవాయిలు ఉపాధి కోల్పోతున్నారు. జిల్లాలోని 18 మార్కెట్ యార్డుల్లో కలిసి 1914 మంది హమాలీలు పనిచేస్తున్నారు.

 రైతులకు టోకరా
 జిల్లాలో మొత్తం 236 రైస్ మిల్లులు ఉన్నాయి. వీరు మార్కెట్‌యార్డుల్లో చేస్తు న్న కొనుగోళ్లు కేవలం 5శాతం కూడా మించడంలేదు. వీరంతా ప్రధానంగా గ్రామాల్లో రైతుల నుంచి నేరుగా కొనుగోళ్లు జరుపుతున్నారు. అందుకు రైతులను రకరకాల మాయ మాటలతో పక్కదారి పట్టిస్తున్నారు. మార్కెట్‌కు తీసుకెళ్తే, హమాలీ, కాంట తదితర ఖర్చులు వస్తాయని, అదే తమకు అమ్మకాలు చేస్తే ఇ వేం ఖర్చులు ఉండవని ఆశ పుట్టిస్తున్నా రు. ఇందుకోసం రైస్‌మిల్లర్లు గ్రామాల్లో ప్రత్యేకంగా ఏజెంట్ల ద్వారా వారికి క్వింటాలుకు కమీషన్ ఇస్తున్నారు.

ఇదే అదనుగా భావించిన కొందరు దళారులు పెద్దఎత్తున దందా మొదలుపెట్టారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తూ తూకం విషయంలో మోసం చేస్తున్నారు. ధాన్యాన్ని నేరుగా వేబ్రిడ్జిల వద్దకు తీసుకె ళ్లి అక్కడ వారికి ముందే పరిచయమున్న వారితో కనుసైగ చేస్తారు. అంతే..ఇక తూకంలో తేడాలు చోటుచేసుకుంటున్నా యి. ఈ విషయం తెలియక రైతులు మో సపోతున్నారు. అలాగే రైస్‌మిల్లర్లు ప్రభుత్వానికి మరో విధంగా కూడా టోకరా పెడుతున్నారు.

రైతుల నుంచి కొనుగోళ్ల కు సంబంధించి ప్రభుత్వం వద్ద ఎలాం టి రికార్డు ఉండకపోవడంతో ఆ ధాన్యా న్ని బియ్యంగా మార్చి బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఇందుకు ప్రభుత్వ అధికారుల అండదండలు ఉండటంతో జిల్లా లో జీరోదందా పెద్దఎత్తున సాగుతోంది. ఈ తతంగం బయటపడకుండా ఉండేం దుకు రైస్‌మిల్లులు మరో ఎత్తుగడ పన్నుతున్నాయి. మార్కెట్ యార్డుల నుంచి కేవలం 5 నుంచి 10 శాతం కొనుగోలు చే సి అధికారుల ముందు ఉంచుతున్నారు.
 
 వ్యాపారులకు అండా దండా..
 జీరోదందా సాగిస్తున్న రైస్ మిల్లర్లకు ఓవైపు నుంచి అధికారులు, మరోవైపు నుంచి రాజకీయ నాయకుల అండ పుష్కలంగా ఉంది. దీంతో వారి దందా మూ డుపూలు, ఆరుకాయలు అన్న చందంగా సాగుతోంది. జిల్లాలో అక్రమదందాను అరికట్టేందుకు ప్రభుత్వం 22 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసింది. అయితే ఇవన్నీ కూడా కేవలం నామమాత్రంగానే పనిచేస్తున్నాయి. అధికారులు మామూళ్లకు అలవాటుపడి చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో అక్రమ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. వీరికి రాజకీయ నాయకులు అండదండలు ఉండడంతో వారిని ఎవరేమీ చేయలేకపోతున్నారు.

 అడ్డుకట్టకు ఒకటే మార్గం..
 ఈ అక్రమ దందాకు చెక్ పెట్టాలంటే ఉన్న ఏకైక మార్గం.. జీఐఎస్ (జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం) గూగుల్ మ్యాప్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తే అక్రమాలకు అడ్డుకట్ట వేసే అవకాశముంది. జీఐఎస్ పరిజ్ఞానంతో అన్ని రైస్ మిల్లులను ఈ సాంకేతిక పరిజ్ఞానం కిందకు తీసుకొస్తే రైస్ మిల్లులకు వచ్చే ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రికార్డు చేసుకునే వీలుంది. ఈ విషయంలో కలెక్టర్ చొరవతీసుకొని సీసీ కెమెరాలు, లేదా జీఐఎస్ విధానానికి శ్రీకారం చుడితే ఈ అక్రమాలకు తెరపడే అవకాశం ఉంది. ఈ విధానం ద్వారా ప్రభుత్వం ఆదాయం వచ్చే అవకాశం ఉంది.
 
 జిల్లాలో మార్కెట్‌యార్డులు                                         18
 మార్కెటింగ్ చెక్‌పోస్టులు                                             22    
  రైస్ మిల్లులు                                                          236
 మార్కెట్ యార్డుల్లో పనిచేస్తున్న హమాలీలు            1914
 ప్రభుత్వ రంగ సంస్థలు చేసిన కొనుగోళ్లు                 18,024 క్వింటాళ్లు
 రైస్ మిల్లులు కొనుగోలు చేసిన ధాన్యం                             2 లక్షల క్వింటాళ్లు

మరిన్ని వార్తలు