సాదాసీదాగా జెడ్పీ ‘స్థాయి’ సమావేశాలు

16 Jul, 2015 00:55 IST|Sakshi
సాదాసీదాగా జెడ్పీ ‘స్థాయి’ సమావేశాలు

కోరం లేక ‘ఒకటి’ వాయిదా
కనీస గుర్తింపు లభించడం లేదని సభ్యుల ఆవేదన

 
హన్మకొండ : జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘాల సమావేశాలు బుధవారం హన్మకొండలోని జిల్లా ప్రజా పరిషత్ కా ర్యాలయంలో జరిగాయి. ఏడు స్థాయి సంఘాలకుగాను ఆరుస్థాయి సంఘాలు యథావిధిగా కొన సాగారుు. కాగా చివరిగా జరుగాల్సిన ఒకటో స్థారుు సంఘం సమావేశం కో రం లేకపోవడంతో ఒకటవ స్థాయి సంఘం సమావేశం వా యిదా వేస్తున్నట్లు జెడ్పీ చైర్‌పర్సన్ గద్దలపద్మ ప్రకటించా రు. ఈ స్థాయి సంఘంలో కోరంకు అయిదుగురు జెడ్పీటీసీ సభ్యులు అవసరం కాగా నలుగురు సభ్యులు మాత్రమే హాజరయ్యారు. కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మూలగుండ్ల వెంకన్న తో పాటు పలువురు జెడ్పీటీసీ సభ్యులు కార్యాలయం అవరణలో ఉన్నా సమావేశానికి హాజరు కాలేదు. ఒకటో స్థారుు సంఘంలో జెడ్పీ చైర్‌పర్సన్ గద్దలపద్మ, రాష్ట్ర గిరిజన సంక్షే మశాఖ మంత్రి ఆజ్మీర చందూలాల్, ఎంపీ ప్రొఫెసర్ ఆజ్మీర సీతారాం నాయక్, ఎమ్మెల్యే లు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, చల్లా ధర్మారారెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు స్వామి నాయక్, పా లకుర్తి సారంగపాణి, జాటోత్ కమలాకర్, వేముల స్వప్న, మూలగుండ్ల వెంకన్న, లేతాకుల సంజీవ రెడ్డి, బానోత్ విజయబాయి, బాకి లలిత సభ్యులుగా ఉన్నారు. ఇందులో జెడ్పీ చైర్‌పర్సన్‌తోపాటు సభ్యులు కమలాకర్,విజయబా యి, లలిత మాత్రం రిజిస్టర్‌లో సంతకా లు చేశారు. కోరంకు మరో సభ్యుడు అవసరం కాగా ఫోన్‌లో సభ్యులను సంప్రదించారు.

వాయిదా వేసిన అనంతరం పాలకుర్తి సారంగపా ణి చేరుకున్నారు. మిగతా సభ్యులు సమావేశానికి దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మూల గుండ్ల వెంకన్న జెడ్పీ అవరణలో విలేకరులతో మాట్లాడుతూ జెడ్పీటీసీ సభ్యులకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదని, నిధుల సమాచారం చెప్ప డంలేదని, ప్రతిపాదనలు తీసుకురావాలని చెప్పుతూ పను లు కేటాయించడం లేదని ఆరోపించారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో చేసిన తీర్మాణాలు పట్టించుకోవడం లేదని వాపోయూరు. ఏ విషయం చైర్‌పర్సన్ , అధికారుల దృష్టికి తీసుకెళ్లినా మంత్రి చెపితేనే చేస్తామని చెపుతున్నారని ఆరోపించారు. ఇందుకు నిరసనగానే తాము ఒక టోస్థారుు సంఘ సమావేశాన్ని బహిష్కరించినట్లు చెప్పా రు. ఈ ఆరోపణలను జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ కొట్టి పా రేశారు.కాగాఅంతకు ముందు  2,3,4,5,6,7వ స్థాయి సం ఘాల సమావేశాలు సాదాసీదాగా నడిచాయి. సమావేశంలో జెడ్పీ సీఈఓ అనిల్‌కుమార్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
 
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు