కాంట్రాక్టు రద్దు చేస్తాం

7 Feb, 2015 01:47 IST|Sakshi
కాంట్రాక్టు రద్దు చేస్తాం

మూడు రోజుల్లో పనులు ప్రారంభించాలి
జెడ్పీ భవన నిర్మాణంలో నిర్లక్ష్యం సహించేది లేదు
జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సునీత

 
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా పరిషత్ భవన నిర్మాణంలో అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదని చైర్‌పర్సన్ సునీతామహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. పనుల జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆమె.. మూడు రోజుల్లో పనులు ప్రారంభించకపోతే కాంట్రాక్టు రద్దు చేస్తామని హెచ్చరించారు.శుక్రవారం తన ఛాంబర్‌లో జెడ్పీ నిర్మాణ పనులు, పంచాయతీ రోడ్ల అభివృద్ధిపై సమీక్షించారు. రూ.10 కోట్ల వ్యయంతో ప్రతిపాదించిన జిల్లా పరిషత్ సముదాయ పనులు మూడేళ్లుగా ఎందుకు ముందుకు సాగడంలేదని అసహనం వ్యక్తం చేశారు.

సకాలంలో పనులు చేయకపోవడంపై కాంట్రాక్టర్‌పై తీవ్రంగా మండిపడ్డ సునీత.. యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టకపోతే కాంట్రాక్టును రద్దు చేస్తానని హెచ్చరించారు. జిల్లాకు మంజూరైన రూ.220 కోట్లతో పంచాయతీరాజ్ రోడ్లకు టెండర్లను త్వరితగతిన ఖరారు చేయాలని ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ రమణారెడ్డి, పంచాయతీరాజ్ ఎస్‌ఈ జాన్‌మిల్టన్, జెడ్పీ ఉపాధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, పీఆర్ ఈఈలు రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు