గళమెత్తారు.. 

16 Jun, 2019 06:57 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న జెడ్పీ చైర్మన్‌ బరపటి వాసుదేవరావు

సాక్షిప్రతినిధి, ఖమ్మం: ప్రజా సమస్యలపై జెడ్పీటీసీ సభ్యులు గళమెత్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్‌ చివరి సర్వసభ్య సమావేశంలో తీరొక్క సమస్యలపై ప్రశ్నించారు. ప్రధానంగా జిల్లాలోని పలువురు రైతులకు పట్టాదారు పాస్‌ పుస్తకాలు అందలేదని, దీంతో వారు రైతుబంధు పథకం ద్వారా లబ్ధి పొందలేకపోతున్నారని, దీనిపై రెవెన్యూ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సభ్యులు ముక్తకంఠంతో డిమాండ్‌ చేశారు. అలాగే మత్స్య సహకార సంఘాలకు కట్టిన భవనాలకు సంబంధించిన నిధులు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. శనివారం జరిగిన జిల్లా పరిషత్‌ సాధారణ చివరి సర్వసభ్య సమావేశానికి జెడ్పీ చైర్మన్‌ బరపటి వాసుదేవరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయం, మార్కెటింగ్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం, వైద్య, ఆరోగ్యం తదితర అంశాలపై చర్చ సాగింది. జిల్లాలో రైతుల వెతలను పట్టించుకునే వారే కరువయ్యారని, రెవెన్యూపరమైన పనులు సామాన్యులకు అందుబాటులోకి రాని పరిస్థితి నెలకొందని, జిల్లాలో రెవెన్యూ వ్యవస్థ బాగుచేయలేనంతగా దెబ్బతిన్నదని, దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కో ఆప్షన్‌ సభ్యుడు జియావుద్దీన్‌ పేర్కొన్నారు.

అనేక మండలాల్లో రైతులకు ఇంకా పట్టాదారు పాస్‌ పుస్తకాలు చేరనేలేదని, సాంకేతిక అంశాలను తప్పులుగా భూతద్దంలో చూపుతూ రైతులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన రైతుబంధు ఆర్థిక సహాయాన్ని అధికారులు అడ్డుకుంటున్నారని, పట్టాదారు పాస్‌ పుస్తకాల్లో ఉన్న లోపాలను, సాంకేతిక తప్పిదాలను సరి చేయాల్సిన క్షేత్రస్థాయి సిబ్బంది  అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సభ్యులు ముక్తకంఠంతో డిమాండ్‌ చేశారు. అలాగే మత్స్య సహకార సంఘాలకు కట్టిన భవనాలకు సంబంధించిన నిధులు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. శనివారం జరిగిన జిల్లా పరిషత్‌ సాధారణ చివరి సర్వసభ్య సమావేశానికి జెడ్పీ చైర్మన్‌ బరపటి వాసుదేవరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయం, మార్కెటింగ్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం, వైద్య, ఆరోగ్యం తదితర అంశాలపై చర్చ సాగింది. జిల్లాలో రైతుల వెతలను పట్టించుకునే వారే కరువయ్యారని, రెవెన్యూపరమైన పనులు సామాన్యులకు అందుబాటులో రాని పరిస్థితి నెలకొందని, జిల్లాలో రెవెన్యూ వ్యవస్థ బాగుచేయలేనంతగా దెబ్బతిన్నదని, దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కో ఆప్షన్‌ సభ్యుడు జియావుద్దీన్‌ పేర్కొన్నారు.

అనేక మండలాల్లో రైతులకు ఇంకా పట్టాదారు పాస్‌ పుస్తకాలు చేరనేలేదని, సాంకేతిక అంశాలను తప్పులుగా భూతద్దంలో చూపుతూ రైతులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన రైతుబంధు ఆర్థిక సహాయాన్ని అధికారులు అడ్డుకుంటున్నారని, పట్టాదారు పాస్‌ పుస్తకాల్లో ఉన్న లోపాలను, సాంకేతిక తప్పిదాలను సరి చేయాల్సిన క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. బోనకల్, ఏన్కూరు జెడ్పీటీసీ సభ్యులు సైతం ఇదే అంశంపై ప్రభుత్వ విధానాలను నిలదీశారు. ఐదేళ్ల తమ పదవీ కాలంలో ప్రజలకు ఎంతో సేవ చేయాలని భావించామని, నిధుల కొరత కారణంగా అనేక పనులు చేయకుండానే పదవీ కాలాన్ని ముగించాల్సి వస్తోందని పలువురు జెడ్పీటీసీలు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని కౌలు రైతులకు భూమి కార్డులు ఇవ్వాలని, వారికి రైతుబంధు వర్తించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ అంశంపై జేసీ అనురాగ్‌ జయంతి మాట్లాడుతూ రైతుబంధు, ఆర్‌ఓఆర్, పట్టాదారు పాస్‌ పుస్తకాల జారీలో ఎదురవుతున్న ఇబ్బందిని, రైతులకు జరుగుతున్న అసౌకర్యంపై తక్షణమే చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే దీనిని అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశంగా జిల్లా అధికార యంత్రాంగం భావించి అనేక చోట్ల గ్రామసభలు నిర్వహించి.. ఈ తరహా ఇబ్బందులను తొలగించే ప్రయత్నం చేస్తున్నామన్నారు.

అలాగే ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి రైతులకు డబ్బులు చెల్లించే ప్రక్రియను మరింత వేగవంతం చేస్తామని, అందరికీ డబ్బులు అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. సభ్యులు ప్రస్తావించిన ప్రతి అంశాన్ని శాఖలవారీగా సమీక్షించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. వ్యవసాయ శాఖకు సంబంధించి రైతులకు నాణ్యమైన విత్తనాలను సరఫరా చేయాలని పలువురు జెడ్పీటీసీ సభ్యులు డిమాండ్‌ చేశారు. మత్స్య శాఖ నిధులతో పలుచోట్ల సంఘ భవనాలు నిర్మిస్తే.. ఇప్పుడు డబ్బులు లేవని ఇబ్బంది పెడుతున్నారని, అప్పుడున్న నిధులు వెనక్కిపోవడానికి బాధ్యులు ఎవరో తేల్చాలని, ఏళ్ల తరబడి నిర్మించిన భవనాలకు డబ్బులు ఇవ్వకపోతే కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకోవడం మినహా మరో మార్గం లేదని బోనకల్‌ జెడ్పీటీసీ సభ్యుడు తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై డిప్యూటీ సీఈఓ అప్పారావు స్పందిస్తూ.. ఈ నిధులకు సంబంధించి ప్రభుత్వానికి తక్షణమే లేఖ రాయడంతోపాటు నిధుల లభ్యతపై పూర్తిస్థాయి దృష్టి సారిస్తామని చెప్పారు. ప్రభుత్వ పర్యవేక్షణ అనేక అంశాల్లో కరువవడంతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారని, తాలిపేరులో చేప పిల్లలు వేస్తామని అధికారులు మాకు సమాచారం ఇచ్చారని, నాలుగు లారీల్లో చేప పిల్లలు వస్తున్నాయని వేసేందుకు ఆహ్వానించారని.. తీరా తాము అక్కడికి వెళ్లేసరికి లారీలు, చేప పిల్లలు లేవని, ఇదేమిటని పరిశీలిస్తే.. తాలిపేరు చెరువులో చేప పిల్లలను వదిలేశామని చెబుతున్నారని, ఆ ప్రాంతంలో లారీ టైర్ల అచ్చులు సైతం పడకుండా అన్ని లారీలు ఎలా వచ్చాయో ఇప్పటికీ అర్థం కావడం లేదని దుమ్ముగూడెం జెడ్పీటీసీ ఆవేదన వ్యక్తం చేశారు.

దీనిపై అధికారులు దృష్టి సారించాలన్నారు. ఏన్కూరు జెడ్పీటీసీ సభ్యురాలు మాట్లాడుతూ ఏన్కూరు వ్యవసాయ మార్కెట్‌లో దళారుల దందా రాజ్యమేలుతోందని, రైతుకు తీవ్రస్థాయిలో అన్యాయం జరుగుతోందని, ఇదేమిటని ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు ప్రశ్నిస్తే.. వారిని లోబరుచుకోవడానికి దళారులు ప్రయత్నిస్తున్నారని, దీనిపై అధికారులు దృష్టి సారించకపోతే రైతు అన్యాయమైపోతాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లందు జెడ్పీటీసీ చండ్ర అరుణ మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు అందించే రైతుబంధు డబ్బులను కొన్ని బ్యాంకులు పాత బాకీల కింద జమ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని, ఇది తీవ్రవైన విషయంగా ప్రభుత్వం పరిగణించాలని, రైతుకు పెట్టుబడి సహాయంగా ఇచ్చే నగదును పాత అప్పుల కింద బ్యాంకు అధికారులు జమ చేసుకునే పద్ధతికి అధికారులు చెక్‌ పెట్టకపోతే రైతుబంధు పథకం నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి పలు ఉదాహరణలను వివరించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన జెడ్పీ చైర్మన్‌ బరపటి వాసుదేవరావు మాట్లాడుతూ గత ఐదేళ్లలో కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. సీఎం కేసీఆర్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇతర ప్రజాప్రతినిధుల సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ తదితర పథకాలను అర్హులైన పేదలకు అందించడంలో ప్రజాప్రతినిధులంతా పాలుపంచుకున్నారని అన్నారు. సమావేశంలో జెడ్పీ కోఆప్షన్‌ సభ్యులు మహ్మద్‌ మౌలాన, జియావుద్దీన్, ఉమ్మడి జిల్లాలోని జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు