సంగీతమే ప్రాణం

7 Mar, 2018 10:49 IST|Sakshi

ప్రముఖ సినీ గాయకుడు కారుణ్య

నెల్లూరు(బృందావనం): చిరుప్రాయం నుంచి సంగీతమే ప్రాణంగా జీవితాన్ని గడుపుతున్న తనకు నెల్లూరులో జరుగుతున్న త్యాగరాజస్మరణోత్సవాల్లో పాల్గొనే భాగ్యం దక్కడం పూర్వజన్మ సుకృతమని ప్రముఖ సినీగాయకుడు ఎన్‌.సి.కారుణ్య పేర్కొన్నారు. నెల్లూరులో మంగళవారం నుంచి ప్రారంభమైన 53వ శ్రీత్యాగరాజస్మరణోత్సవాల కార్యక్రమానికి కారుణ్య విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. సంగీతంలో తమ ఆరాధ్య దైవంగా భావించే ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆహ్వానం మేరకు నెల్లూరుకు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సంగీతం జీవితానికి సంతృప్తిని ఇస్తుందని, సంగీతమంటే అర్థంకాకుండా చేసే గానం కాదన్నారు.

బాల్యం నుంచి శాస్త్రీయ సంగీతం న్యూజెనరేషన్‌ వాగ్గేయకారులు తన పెద్దనాన్న వాగ్దేయ విద్వాన్‌మణి నల్లాన్‌ చక్రవర్తిమూర్తి సహకారంతో సంగీతసాధన చేశానని తెలిపారు.
గురుసేవగా సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టానని పేర్కొన్నారు. శాస్త్రీయసంగీతమే తన పాటలకు బీజమన్నారు. ఇండియన్‌ ఐడల్‌ జడ్జి సోనునిగమ్‌ తన ఇంటికి పిలిపించి పాటలనుస్పష్టంగా పాడేందుకు గల కారణం శాస్త్రీయ సంగీతమే సాధన అని తెలుసుకుని ప్రశంసించారని పేర్కొన్నారు.

గత ఏడాది హైదరాబాద్‌లో అక్టోబరు 6వ తేదీ, డిసెంబరు 25వ తేదీన తొలి కర్ణాటక సంగీత కచేరి నిర్వహించానన్నారు. తొలిసంగీత కచేరి సందర్భంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను ఆహ్వానించేందుకు వెళ్లిన తాను ఆయన ఆహ్వానం మేరకు ఆరునెలల తిరుగకమునుపే నెల్లూరు వచ్చి శాస్త్రీయసంగీత కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంంగా ఉందన్నారు.

15 ఏళ్ల నుంచి సంగీతంపై పట్టు
15 ఏళ్ల నుంచి సంగీతంపై పట్టు ఉందని కారుణ్య తెలిపారు. ఇప్పటికీ ఎన్‌.సి.కారుణ్య యూ ట్యూబ్‌ వీడియో ఉందని పేర్కొన్నారు. ఎన్‌.సి.కారుణ్య అని టైప్‌చేస్తే  మంచి సంగీతం వినొచ్చని తెలిపారు. వందే భావగురుమ్‌ శీర్షికతో సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేసిన లబ్దప్రతిష్టులైన గురువులను స్మరిస్తూ కార్యక్రమం నిర్వహిస్తున్నానని తెలిపారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎన్నడూ తనచేత కచేరిపెట్టించుకుంటారని అనుకోలేదన్నారు. శాస్త్రీయ సంగీతమంటే తొడగొట్టుకుంటూ పాడడంకాదని, సాహిత్యం, భావం అర్థమయ్యే రీతిలో శాస్త్రీయ సంగీతానికి విశేష ప్రచారం కల్పించాలని ఉందన్నారు. రాగాలు, కొత్త ప్రక్రియలు, థిల్లానా పాడనున్నట్లు పేర్కొన్నారు.

Read latest Tollywood News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా