నాగచైతన్యకు గిఫ్ట్‌

13 Mar, 2018 08:39 IST|Sakshi

‘అనంత’లో తళుక్కుమన్న సినీతార

హ్యాపీ మొబైల్స్‌ను ప్రారంభించిన అక్కినేని సమంత

అనంతపురం న్యూసిటీ:     ‘అనంత’లో అందాల నటి సమంత అక్కినేని తళుక్కుమన్నారు. సొట్టబుగ్గలతో చిరునవ్వు చిందిస్తూ అభిమానుల్లో ఆనందాన్ని నింపారు. సుభాష్‌రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన హ్యాపీ బ్రాండెడ్‌ మొబైల్‌ స్టోర్స్‌ను సినీనటి సమంత సోమవారం రిబ్బన్‌కట్‌ చేసి, ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి, హ్యాపీ మొబైల్స్‌ లోగో, పలు ఇంటర్నేషనల్‌ మొబైల్స్‌ను ఆమె ఆవిష్కరించారు. సమంత మాట్లాడుతూ ఎక్కడా లేని విధంగా హ్యాపీ మొబైల్స్‌ నిర్వాహకులు అతి తక్కువ ధరకు ఆన్‌రాయిడ్‌లో (4జీ, 3జీ)మొబైల్స్‌తో పాటు వివిధ రకాల మొబైల్స్‌ను అందుబాటులో ఉంచారన్నారు.  హ్యాపీ మొబైల్స్‌ ఎండీ కృష్ణపవన్, ఈడీ కోట సంతోష్‌ మాట్లాడుతూ సొంత జిల్లాపై ఉన్న ప్రేమతో హ్యాపీ మొబైల్స్‌ను ఇక్కడ ప్రారంభించామన్నారు.

త్వరలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో హ్యాపీ మొబైల్స్‌ సేవలు మరింత విస్తృతం చేయనున్నామన్నారు. రాబోవు రోజుల్లో రూ.500 కోట్ల వ్యయం లక్ష్యంతో 150 నుంచి 200 హ్యాపీ బ్రాండ్‌ మొబైల్‌ స్టోర్స్‌ను నడుపుతామన్నారు. రూ.999 ఫోన్‌ రూ 299, స్మార్ట్‌ ఫోన్‌ రూ.1,999, వన్‌జీబీ 8 జీబీ ర్యాం ఫోన్స్‌ రూ.2,999, 3 జీబీ ర్యాం ఫోన్‌ రూ.6,999 ధరకే అందిస్తున్నామన్నారు. ఇతర మొబైళ్ల కొనుగోలుపై టీవీ, ఫ్రిజ్, ఎయిడ్‌ కూలర్‌తో పాటు మరిన్ని డిస్కౌంట్‌లు అందిస్తున్నామన్నారు. తమ అభిమాన నటిని చూసేందుకు ఉదయం 8 గంటల నుంచే అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దాదాపుగా మూడు గంటల పాటు జనంతో సుభాష్‌రోడ్డు కిక్కిరిసింది.

సెల్ఫీ కాంటెస్ట్‌..

హ్యాపీ మొబైల్స్‌ నిర్వాహకులు తొలి పది మొబైళ్లు కొనుగోలు చేసిన వారికి సెల్ఫీ కాంటెస్ట్‌ను నిర్వహించారు. పది మందికి సెల్ఫీ దిగే చాన్స్‌ను అందించారు. దీంతో సెల్‌ఫోన్‌ కొనుగోలు చేసి, సమంతతో సెల్ఫీ దిగిన కస్టమర్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 

నాగచైతన్యకు గిఫ్ట్‌
షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా హ్యాపీ మొబైల్స్‌ ఎండీ కృష్ణపవన్, ఈడీ కోట సంతోష్‌ అక్కినేని నాగచైతన్యకు ఆపిల్‌ మొబైల్‌ను గిప్ట్‌గా అందించారు.

Read latest Tollywood News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు