పండుగ రోజు పులిహోర.. ఎవరైనా వస్తున్నారా ?

16 Jan, 2018 12:11 IST|Sakshi

సాక్షి, హైదారాబాద్‌ : టీవీ వ్యాఖ్యాత సుమ పరిచయం అవసరం లేని పేరు. ప్రతిరోజు పలు టీవీ చానళ్లలో సందడి చేస్తూనే ఉంటారు. ఆడియో ఫంక్షన్లు, ప్రత్యేక కార్యక్రమాలు చేస్తూ అందరినీ అలరిస్తారు. ఇటీవల సుమ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. అప్పుడప్పుడు లైవ్‌లోకి వచ్చి సోషల్‌ మీడియా అభిమానులను ఆనందిపచేస్తుంటారు. ఇక సంక్రాంతి పండుగ రోజు కూడా సోషల్‌ మీడియాలో ఓ వీడియో పోస్టు చేశారు. అంతే ఆ వీడియో కాస్తా వైరల్‌ అయింది.

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని.. సుమ పులిహోర కలుపుతున్న వీడియోని తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు. వీడియోలో సుమ ఏమన్నారంటే.. ‘‘ పులిహోర.. చింతపండుతో పులిహోర చేస్తున్నాను. ఇదిగో చింతపండు గుజ్జు. ఇదిగో పులిహోర (అదే సమయంలో అక్కడికి తన పెంపుడు కుక్క రావడంతో.. ఏయ్.. నువ్ ఇటు రావద్దు అంటారు). ఎవరైనా వస్తున్నారా పులిహోర టేస్ట్ చేయడానికి..’’  అంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఇప్పుడు అది కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

మరిన్ని వార్తలు