ఎద్దు ఏడ్చింది.. ఎవుసం ఎండింది..

6 Nov, 2015 01:20 IST|Sakshi
ఎద్దు ఏడ్చింది.. ఎవుసం ఎండింది..

అప్పుల బాధతో 10 మంది రైతుల ఆత్మహత్య
ముస్తాబాద్/మంథని: ఎద్దు ఏడ్చిన ఎవుసానికి.. రైతు ఏడ్చిన రాజ్యానికి కష్టకాలమే మిగులుతుంది. ఇంటిల్లిపాదీ ఎండనకా, వాననకా రెక్కలు ముక్కలు చేసి కష్టపడ్డా.. వర్షాభావంతో పం ట లెండి, కనీసం పెట్టుబడి కూడా దక్కక.. అప్పులెలా తీర్చాలనే వేదనతో అన్నదాతలు ఉసురుతీసుకుంటున్నారు. పంట నష్టం, అప్పులబాధతో గురువారం తెలంగాణ జిల్లాల్లో 10 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.

కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మం డలం పోత్గల్‌కు చెందిన నీరటి రాములు(28), మంథని మండలం కూచిరాజ్‌పల్లికి చెందిన రైతు అంబటి సంపత్(35), మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లికి చెం దిన బి.రవీందర్‌రెడ్డి(45), వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లికి చెందిన నాగరబోయిన ఓదేలు(30), మహబూబాబాద్ మండలం అయోధ్య గ్రామానికి చెందిన నూనె వెంకన్న(55), రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం డబీల్‌పూర్ గ్రామానికి చెందిన

యువరైతు సత్యనారాయణ(26), పూడూరు మండలం పెద్ద ఉమ్మెంతాల్ గ్రామానికి చెందిన కావలి తిరుమలయ్య(50), ఖమ్మం జిల్లా  కామేపల్లి మండలం ముచ్చర్లకు చెందిన పత్తి రైతు  రాయల వీరన్న(50), నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి మండలం గండిమాసానిపేట గ్రామానికి చెందిన రైతు కొడిపాక సాయిబాబా (37), కరీంనగర్ జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేటలో శనిగరం మధునయ్య బల వన్మరణాలకు పాల్పడ్డారు.

మరిన్ని వార్తలు