కారు బాంబు పేలుళ్లు: 10 మంది మృతి

28 Apr, 2015 08:43 IST|Sakshi

బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగరం కారు బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఈ పేలుళ్లలో 10 మంది మరణించగా... 38 మంది గాయపడ్డారు. క్షతగాత్రలు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని... వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. పశ్చిమ బాగ్దాద్ మన్షర్ జిల్లా 14వ రమదాన్ వీధిలో రహదారిపై నిలిపి ఉంచిన కారులో బాంబు పేలుడు సంభవించగా...  అమిల్లి జిల్లాలోని మరో కారు బాంబు పేలుడు సంభవించింది.

అయితే భయ్యా జిల్లాలోని వాణిజ్య ప్రాంతంలో కారులో పేలుడు సంభవించి.. ఓ పౌరుడు మరణించగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇరాక్లో బాంబు పేలుళ్లు, విధ్వంసం కారణంగా ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 5576 మంది పౌరులు మరణించగా, 11666 మంది గాయపడ్డారని యూఎన్ ఇటీవల విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ పేలుళ్లు సోమవారం చోటు చేసుకున్నాయి.

మరిన్ని వార్తలు