రేపే బ్యాంకుల సమ్మె

28 Jul, 2016 15:58 IST|Sakshi
రేపే బ్యాంకుల సమ్మె

చెన్నై : ప్రభుత్వం, ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలో ప్రవేశపెడుతున్న పాలసీలను, సంస్కరణలను వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగులు రేపు సమ్మెకు దిగనున్నారు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ), మంగళవారం ప్రభుత్వ అధికారులతో జరిపిన చర్చలు విఫలమవ్వడంతో, గతంలో సమ్మెకు పిలుపునిచ్చిన మాదిరిగానే శుక్రవారం ఒక్కరోజు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు బంద్ కానున్నట్టు బ్యాంకు యూనియన్ల ఫోరం ప్రకటించింది.

అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్(ఏఐబీఈఏ) ప్రధాన కార్యదర్శి సీ.హెచ్ వెంకటచలం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్, ప్రైవేట్ బ్యాంకులకు చెందిన 10 లక్షల మంది ఉద్యోగులు, ఆఫీసర్లు ఈ బంద్ పాల్గొనబోతున్నారని తెలిపారు. 80 వేలకు పైగా ప్రభుత్వ, ప్రైవేట్, విదేశీ బ్యాంకులు శుక్రవారం క్లోజ్ కానున్నాయి. అసమంజసమైన బ్యాంకింగ్ సంస్కరణ నేపథ్యంలో బ్యాంకులు వన్ డే బంద్ను చేపడుతున్నాయి.

మరిన్ని వార్తలు