ఒక్కరోజులోనే లక్ష ఫోన్ల అమ్మకం

22 Sep, 2016 16:07 IST|Sakshi
ఒక్కరోజులోనే లక్ష ఫోన్ల అమ్మకం
రిలయన్స్ జియో వెల్కమ్ ఆఫర్తో బ్యాటరీ ఫోకస్డ్గా వచ్చిన మోటోరోలా కొత్త ఫోన్ మోటో ఈ3 పవర్కు భారత మార్కెట్లో అనూహ్య స్పందన వస్తోంది. గత సోమవారం విడుదలైన ఈ ఫోన్, కేవలం ఒక్కరోజులోనే లక్ష ఫోన్లు విక్రయించినట్టు కంపెనీ హర్షం వ్యక్తంచేసింది. సోమవారం అర్థరాత్రి నుంచి ఈ ఫోన్ ప్రత్యేకంగా ఫ్లిప్కార్ట్ ప్లాట్ఫామ్పై అందుబాటులోకి వచ్చింది. విడుదలైన ఒక్కరోజులోనే లక్ష యూనిట్లను విక్రయించామని దేశీయ మోటోరోలా మొబిలిటీ జనరల్ మేనేజర్ అమిత్ బోనీ తన సంతోషాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.  తమ టీమ్స్ ఫ్లిప్కార్ట్, మోటో-ఐఎన్డీలు చరిత్ర సృష్టించాయని, కేవలం ఒక్కరోజులోనే 1,00,000 మోటోఈ3 పవర్ స్మార్ట్ఫోన్లు అమ్ముడుపోయినట్టు బోనీ ట్విట్టర్ ద్వారా వినియోగదారులకు కృతజ్ఞతలు చెప్పాడు.  రూ.7,999లతో మోటో ఈ3 వపర్ స్మార్ట్ఫోన్ను కంపెనీ గత సోమవారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది.  ఈ ఫోన్తో పాటు రిలయన్స్ జియో వెల్కమ్ ఆఫర్ కంపెనీ అందిస్తోంది.  ప్రవేశ ఆఫర్ కింద ఈ ఫోన్ ధరపై  రూ.1,000 తగ్గింపును కంపెనీ ఒక్క రోజు చేపట్టింది.
 
మోటో ఈ3 వపర్ స్పెషిఫికేషన్స్...
5 అంగుళాల హెచ్డీ డిస్ప్లే
720x1280 పిక్సెల్ రెజుల్యూషన్
1గిగా హెడ్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ఎంటీ6735పీ ప్రాసెసర్
2 జీబీ ర్యామ్
16 జీబీ ఇన్బిల్ట్ స్టోరేజ్
128 జీబీ వరకు విస్తరణ మెమరీ
8 ఎంపీ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్మాలో ఆపరేటింగ్ సిస్టమ్
డ్యుయల్ సిమ్ సపోర్టు
బ్యాటరీ సామర్థ్యం 3500 ఎంఏహెచ్
మరిన్ని వార్తలు