'తల్లికి పురుడు పోసిన 11ఏళ్ల బాలుడు'

28 Sep, 2015 17:40 IST|Sakshi
'తల్లికి పురుడు పోసిన 11ఏళ్ల బాలుడు'

వాషింగ్టన్: పదకొండేళ్ల బాలుడంటే ఆటలు, పాటలు, స్నేహితులతో కలిసి వీధుల్లో గెంతడాలు, స్కూలుకు వెళితే పాఠాలు వల్లేవేయడాలు వంటివే తెలుసు. కానీ, అలాంటి బాలుడే తన తల్లికి, ఆ తల్లి కడుపులో బిడ్డకు ప్రాణం పోస్తే.. జార్జియాలోనే మారియట్టాలో ఇదే జరిగింది. కెన్యార్డా అనే మహిళ నిండు చూలాలు. అంతకుముందే ఆమెకు జేమ్స్ డ్యూక్ అనే పదకొండేళ్ల బాలుడు ఉన్నాడు. కాగా, వైద్యులు ఇచ్చిన సమయానికంటే ముందుగానే ఆమెకు పురిటినొప్పులు వచ్చి ఇంట్లో పడిపోయింది.

ఆ సమయంలో జేమ్స్ మాత్రమే ఇంట్లో ఉన్నాడు. తల్లి ప్రసవ వేదన చూసి దగ్గరికి వచ్చిన అతడు తన తల్లి సుఖంగా ప్రసవించడంలో సహాయపడి, అటు తల్లి ప్రాణాన్ని, కొత్తగా లోకం చూసిన తన సోదరి ప్రాణాలను రక్షించుకుని ఒక్కసారిగా అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఈ సంఘటన అనంతరం తన కుమారుడు సూపర్ హీరో, సూపర్ డాక్టర్ అంటూ పలు రకాలు పొగడ్తల్లో ముంచెత్తుతూ మురిసిపోయింది.

మరిన్ని వార్తలు