13 ఏళ్ల బాలుడిపై గుండాయాక్ట్

16 Sep, 2016 12:40 IST|Sakshi
13 ఏళ్ల బాలుడిపై గుండాయాక్ట్
కాన్పూర్ : పదమూడేళ్ల కుర్రాడిపై ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. హింసను ప్రేరేపిస్తున్నాడంటూ, చాలా కేసుల్లో ప్రమేయం ఉందంటూ పదమూడేళ్ల బాలుడిపై గూండా యాక్ట్ కింద కేసు నమోదుచేశారు. కన్పూర్ పట్టణ సమీపంలోని నవాబ్ జంగ్ పోలీసులు ఈ చర్యకు పాల్పడ్డారు. ఈ కేసులో అరెస్టు అయిన వారికి బెయిల్ అంత ఈజీగా బెయిల్ దొరకకు పోగా, ఆరునెలల వరకు జిల్లా నుంచి కూడా సదరు వ్యక్తులను బహిష్కరించే అధికారం పోలీసులకు ఉంటుంది. కౌలాలి గ్రామానికి చెందిన యోగేంద్రపాల్ తన కొడుకును అక్రమ కేసులో ఇరికించి గూండా యాక్ట్ ప్రయోగించారని స్థానిక కోర్టును ఆశ్రయించి సెప్టెంబర్ 11న బెయిల్ పొందాడు.
 
తన కొడుకిపై గూండా యాక్ట్ కింద కేసు నమోదుచేయడం వల్ల సరిగా పాఠశాలకు పోవడం లేదని, నవాబ్జంగ్ పోలీసులు నమోదుచేసిన ఈ అక్రమ కేసులను ఎత్తివేయాలని ఆయన పట్టణ ఎస్పీ రాజేష్ కృష్ణన్ కోరారు. తొమ్మిదో తరగతి చదివే ఈ బాలుడు ట్రెరర్ కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నాడని, చాలా కేసుల్లో ఈ బాలుడికి ప్రమేయం ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. బాలుడి వయసుకు సంబంధించిన సంబంధిత డాక్యుమెంట్లను సిటీ ఎస్పీకి తండ్రి యోగేంద్ర సమర్పించాడు. ఇది చాలా సీరియస్ విషయం, బాలుడిపై తప్పుడు కేసు బనాయించినట్లు తేలితే సంబంధిత స్టేషన్ పోలీసులపై కఠిన చర్యలు తప్పవని  ఎస్పీ రాజేష్ హెచ్చరించారు. పిల్లాడిపై విధించిన కేసుకు సంబంధించి పూర్తి నివేదికను కోరానని ఆయన తెలిపారు. మూడు రోజుల్లో నవాంబ్జంగ్ పోలీసులు ఈ నివేదికను అందించాలని ఆదేశించారు.
మరిన్ని వార్తలు