కేటీపీఎస్ 5వ దశలో 150 మెగావాట్ల విద్యుత్ ఉత్త్పత్తి

14 Jul, 2015 22:49 IST|Sakshi

పాల్వంచ: కేటీపీఎస్ 5వ దశలో 150 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని మంగళవారం సాయంత్రం నుంచి బ్యాక్‌డౌన్ చేసినట్లు సీఈ సిద్దయ్య తెలిపారు. వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల 9, 10, 11 యూనిట్లలో 150 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని లోడ్ డిస్పాజ్ కేంద్రం ఆదేశాల మేరకు తగ్గించినట్లు తెలిపారు. తడి బొగ్గు కారణంగా మూడు యూనిట్లలో మరో 50 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుందన్నారు.

కేటీపీఎస్ ఓఅండ్‌ఎంలో వార్షీక మరమ్మతుల్లో ఉన్న 1, 6 యూనిట్లు మినహా మిగిలిన 2, 3, 4, 5, 7 , 8 యూనిట్లలో ప్రతిరోజూ 450 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కావాల్సిఉండగా తడిబొగ్గు కారణంగా 50 నుంచి 60 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుందని సీఈ బి.లక్ష్మయ్య తెలిపారు. తీశారు. రాజమండ్రిలో తొక్కిసలాటలో మృతి చెందిన వారికి నివాళులు అర్పించారు.

మరిన్ని వార్తలు