156 మంది ఐపీఎస్‌లకు శిక్షణ పూర్తి

30 Oct, 2015 01:36 IST|Sakshi
156 మంది ఐపీఎస్‌లకు శిక్షణ పూర్తి

* రేపు పాసింగ్ ఔట్ పరేడ్
* ఎన్‌పీఏ డెరైక్టర్ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: సివిల్ సర్వీసెస్ 2013 బ్యాచ్‌కు చెందిన 156 మంది ఐపీఎస్‌లకు 46 వారాల పాటు శిక్షణ ఇచ్చినట్లు సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ (ఎస్‌వీపీ ఎన్‌పీఏ) డెరైక్టర్ అరుణ  బహుగుణ తెలిపారు. వారికి ఈ నెల 31న పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గురువారమిక్కడ పోలీసు అకాడమీలో విలేకరులతో చెప్పారు. గత రెండేళ్లుగా యువత ఐపీఎస్ వైపు ఎక్కువగా మొగ్గుచూపుతోందన్నారు.

ముఖ్యంగా బీటెక్, ఎంటెక్ వంటి సాంకేతిక విద్యను అభ్యసించి, కొన్నాళ్లు ఉద్యోగం సైతం చేసిన వారు ఇటువైపు వస్తుండటం మంచి పరిణామన్నారు. పోలీసు విభాగంలో మహిళల శాతం చాలా తక్కువగా ఉండేదని ప్రస్తుతం అది కూడా పెరుగుతోందని చెప్పారు. శిక్షణ పొందిన వారిలో భారత్‌కు చెందిన వారు 141 మంది కాగా, మిగతా 15 మంది భూటాన్, నేపాల్, మాల్దీవులకు చెందిన వారున్నట్లు తెలిపారు. వీరికి అన్ని కోణాల్లో విస్తృత శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు.

సైబర్‌క్రైం, ఐటీ, మహిళల అక్రమ రవాణా, ఫోరెన్సిక్ వంటి వాటితో పాటు గ్రేహౌండ్స్‌తో కలసి పనిచేయడం, అడవుల్లో సాహసాలు వంటి క్షేత్రస్థాయి పరిజ్ఞానం కల్పించామన్నారు. శిక్షణలో భాగంగా తిరుపతి ఉప ఎన్నిక బందోబస్తుకు, రద్దీ సమయంలో శాంతిభద్రతల పర్యవేక్షణ అవగాహన కోసం నాసిక్ కుంభమేళా ఉత్సవాలకు పంపినట్లు తెలిపారు. ప్రస్తుతం వీరందరూ ప్రొబెషనరీ పీరియడ్ కోసం కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లనున్నట్లు పేర్కొన్నారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కన్నతల్లి కర్కశత్వం

ఆ ర్యాంకింగ్స్‌లో కేరళ టాప్‌..!

పెట్టుబడి నిర్ణయాల్లో...మహిళలూ ముందుండాలి..

కలర్స్‌ సంక్రాంతి

‘విధి’ విజయం సాధించాలి

అనుకోని అతిథి!

ఈ సారి నినాదం # ప్రగతి కోసం పట్టు

నేను శక్తి స్వరూపం

‘నేను శక్తి’ వేడుకలు

ఆర్థిక రంగం ఆణిముత్యాలు

సాధ్వీమణులకు వందనం..

ఆత్మ విశ్వాసమే.. వారి గెలుపు గీతం

ఆకాశమే హద్దుగా...

ఈ బ్యాక్టీరియా మంచిదే!

ఖాతా ఉపయోగించడం లేదా..?

కెనడాలో ఉగ్రదాడి!

ఎల్పీజీ సిలిండర్‌పై రూ.1.50 పెంపు

‘శంకర్‌-కమల్‌-దిల్‌ రాజు’ కాంబో మూవీకి సైన్‌

టుడే న్యూస్‌ అప్ డేట్స్‌

టుడే న్యూస్ అప్ డేట్స్‌

అందుకే రాజమౌళి సాయం కోరా: చంద్రబాబు

పెళ్లంటే భయమా? ఇదిగో సర్కారు మంత్రం..

ముఖ్యమంత్రి అభ్యర్థి గద్దర్‌..

‘టీఆర్‌ఎస్‌ భవన్‌కు టులెట్‌ బోర్డు’

కాళేశ్వరం ప్రాజెక్టు; సొరంగంలో మరో ప్రమాదం

ఎన్‌డీటీవీని అమ్మేశారా?

వీఐపీ సంస్కృతికి 650 మంది బలి

భారత్‌పై వాడేందుకే..!

హనీప్రీత్‌ ఎక్కడుందో నాకు తెలుసు: నటి

అమెరికాలో కాల్పుల కలకలం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!