ల్యాండింగ్‌లో రన్వేను ఢీకొన్న విమానం

24 Jan, 2017 19:38 IST|Sakshi
ల్యాండింగ్‌లో రన్వేను ఢీకొన్న విమానం

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా విమానాశ్రయంలో కొద్దిలో పెద్ద ప్రమాదం తప్పింది. ముంబై నుంచి వెళ్లిన జెట్‌ ఎయిర్వేస్ బి737-800 విమానం ల్యాండ్‌ అయ్యే సమయంలో తోకభాగం రన్వేను ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ విమానంలో ఉన్న 8 సిబ్బందితో సహా మొత్తం 168 మంది క్షేమంగా బయటపడ్డారు. కాగా విమానం దెబ్బతింది. ఈ నెల 22న ఈ ఘటన జరిగింది. జెట్‌ ఎయిర్వేస్ ఇంజనీర్లు ఈ విమాన నష్టాన్ని అంచనా వేస్తున్నారు. అలాగే బోయింగ్ కంపెనీకి చెందిన ఓ బృందం కూడా ఢాకాకు వెళ్తుందని భావిస్తున్నారు.

బంగ్లాదేశ్‌ పౌరవిమాయన సంస్థ అధికారులు ఈ ఘటనపై విచారణ చేస్తారని భావిస్తున్నట్టు డీజీసీఏ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌) అధికారులు చెప్పారు. ఈ ప్రమాద ఘటనపై దర్యాప్తు చేయరాదని వారు నిర్ణయిస్తే ఏఏఐబీ విచారణ చేపట్టవచ్చని తెలిపారు. విచారణకు అన్ని విధాల సహకరిస్తామని జెట్ ఎయిర్వేస్ పేర్కొంది. విమాన ప్రమాదానికి బాధ్యులుగా ఇద్దరు పైలట్లను విధుల నుంచి తప్పించింది.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కలర్స్‌ సంక్రాంతి

‘విధి’ విజయం సాధించాలి

అనుకోని అతిథి!

సినిమా

రష్మిక అంటే క్రష్‌ అంటున్న హీరో..

నిజంగానే గ‌డ్డి తిన్న స‌ల్మాన్‌

ముకేష్‌పై శత్రుఘ్న సిన్హా ఘాటు వ్యాఖ్యలు

'శ్రియా.. ప్లీజ్‌ అతన్ని ఇబ్బంది పెట్టకు'

‘నా భర్త దగ్గర ఆ రహస్యం దాచాను’

బన్నీపై కేరళ సీఎం ప్రశంసల వర్షం