టాయ్లెట్లో 2.5 కిలోల బంగారం

29 Aug, 2016 18:36 IST|Sakshi
టాయ్లెట్లో 2.5 కిలోల బంగారం

పనాజీ: ఎయిరిండియా విమానంలోని టాయ్లెట్లో రెండున్నర కిలోల బంగారు ఆభరణాలను కనుగొన్నారు. కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ అధికారులు ఈ నగలను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం దుబాయ్ నుంచి పనాజీ (గోవా)కి వచ్చిన విమానంలో బంగారు నగలను అక్రమంగా తరలిస్తూ టాయ్లెట్లో దాచారని అధికారులు చెప్పారు. వీటి విలువ 75 లక్షల రూపాయల ఉంటుందని తెలిపారు.

విమాన సిబ్బందిని విచారిస్తున్నట్టు కస్టమ్స్ అధికారి చెప్పారు. అలాగే విమానంలో వచ్చిన ప్రయాణికుల జాబితాను తీసుకుని విచారిస్తామని తెలిపారు. కస్టమ్స్ అధికారుల తనిఖీ అనంతరం విమానం పనాజీ నుంచి బెంగళూరుకు బయల్దేరివెళ్లింది. ఈ ఏడాది దుబాయ్ నుంచి గోవాకు వచ్చిన ఎయిరిండియా విమానాల్లో ఈ తరహాలో భారీగా బంగారు పట్టుబడటం ఇది మూడోసారి అని అధికారులు చెప్పారు.

మరిన్ని వార్తలు