హుగ్లీలో బాంబు పేలుడు; ఇద్దరికి గాయాలు

31 Dec, 2015 12:18 IST|Sakshi

హుగ్లీ: బాంబు పేలుడు ఘటనలో ఇద్దరు గాయపడిన ఘటన పశ్చిమబెంగాల్ లోని హుగ్లీ జిల్లాలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. బాలాగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుప్తిపారాలోని మార్కెట్ లో ఈ ఘటన జరిగింది. హార్డ్ వేర్ షాపు ముందుపెట్టిన పాతబడిన క్యాన్ ను పక్కకు పెడుతున్నప్పుడు ఒక్కసారిగా పేలుడు సంభవించింది.

షాపులో పనిచేస్తున్న తపస్ రాజబంగ్షీ, నితాయ్ దాస్ అనే మరో వ్యక్తి ఈ ఘటనలో గాయపడ్డారని పోలీసులు తెలిపారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పేలుడు భయంతో షాపులు మూసివేశారని, పలువురు దుకాణాలు తెరవలేదని పోలీసులు చెప్పారు.

మరిన్ని వార్తలు