నేపాల్ను మరోసారి భయపెట్టిన భూకంపం

20 May, 2015 19:00 IST|Sakshi

కఠ్మాండు: నేపాల్పై భూదేవికి ఇంకా ఆగ్రహం తగ్గనట్టుంది. ఇప్పటికే భారీ భూకంపానికి గురై ప్రాణ భయంతో ఇళ్లలో నివసించడానికే జంకుతున్న నేపాల్ ప్రజల గుండెల్లో బుధవారం మరోసారి భయం అలుముకుంది. రిక్టర్ స్కేలుపై 4.4 తీవ్రతతో భూమి పలుమార్లు కంపించింది. దీంతో అక్కడి ప్రజలు ఉలిక్కిపడ్డారు. సరిగ్గా మద్యాహ్నం 2.47 గంటలకు ఇది సంభవించింది. కఠ్మాండు-లలిత్ పూర్-మకావన్ పూర్ మధ్యలో ఈభూకంప కేంద్రం ఉన్నట్లు భూగోళ శాస్త్రజ్ఞులు గుర్తించారు. కాగా, అంతకుముందు కూడా ఉదయం 11గంటల ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 4.2 తీవ్రతతో భూమి కంపించింది. గత ఏప్రిల్ 25న భారీ భూకంపం సంభవించి దాదాపు పదివేలమందికి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు