అధ్యక్ష భవనంపై బాంబుల వర్షం!

16 Jul, 2016 09:20 IST|Sakshi
అధ్యక్ష భవనంపై బాంబుల వర్షం!

అంకారా: అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్‌కు వ్యతిరేకంగా సైన్యం తిరుగుబాటుకు దిగడంతో టర్కీలో ఒక్కసారిగా యుద్ధ వాతావరణం నెలకొంది. టర్కీలో ప్రధాన నగరాలైన ఇస్తాంబుల్, అంకారాలలో తిరుగుబాటు అనుకూల సైనికులు, ప్రభుత్వ అనుకూల సైనికుల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ ఘర్షణల్లో 17మంది పోలీసు అధికారులు సహా 42 మంది చనిపోయారు. మృతుల్లో పౌరులే అధికంగా ఉన్నారు. ఈ ఘర్షణల్లో తిరుగుబాటు సైనికులదే పైచేయిగా ఉన్నట్టు ప్రాథమిక కథనాలు చాటుతున్నాయి. టర్కీలో సైనిక తిరుగుబాటు లైవ్ అప్ డేట్స్ ఇవి..

  •  టర్కీ పార్లమెంటు భవనం వద్ద రెంబు బాంబు పేళ్లులు, పలువురికి గాయాలు
  • సైనిక తిరుగుబాటుదారుల విమానాన్ని కూల్చేసిన ప్రభుత్వ దళాలు
  •  సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి రావాలని ఎర్డోగాన్ పిలుపు.. సైనిక తిరుగుబాటును ధిక్కరిస్తున్న ఎర్డోగాన్ మద్దతుదారులు
  • అంకారాలోని టర్కీ అధ్యక్ష భవనం సమీపంలో బాంబులను విసిరిన జెట్ విమానం
  • టర్కీలో కర్ఫ్యూ, సైనిక పాలన విధించిన మిలిటరీ
  • టర్కీ తీరప్రాంతమైన మార్మారీస్‌కు అధ్యక్షుడు ఎర్డోగాన్ విహాయాత్రకు వెళ్లడంతో ఇదే అదనుగా తిరుగుబాటుకు తెగబడ్డ సైన్యం
  • విహారయాత్ర నుంచి తిరిగొచ్చిన టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌కు ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్టులో మద్దతుదారుల ఘనస్వాగతం
  • సైనిక తిరుగుబాటు దేశద్రోహమేనని ప్రకటించిన ఎర్డోగాన్

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు