ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు: 20 మంది మృతి

16 Aug, 2014 09:24 IST|Sakshi
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు: 20 మంది మృతి

హైదరాబాద్: మరోసారి భారీ వర్షాలతో ఉత్తరాఖండ్ చిగురుటాకులా వణికిపోతుంది. ఎడతేరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో 20 మంది మరణించారు. కొండ చరియలు విరిగిపడి పలు నివాసాలు ధ్వంసమైనాయి. వర్షాలతో రాష్ట్రంలో నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పలు ప్రాంతాలు జలమైనాయి. దాంతో వేలాది మంది ప్రజలు నీటిలో చిక్కుకున్నారు. అలాగే యాత్రికులు కూడా వరదల్లో చిక్కుకున్నారు. తమను రక్షించాలంటూ వారు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు.

బాధితులు,యాత్రికులను రక్షించేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులోభాగంగా హెలికాప్టర్లతో వారిని తరలించాలని నిర్ణయించింది. అయితే డెహ్రాడూన్లో వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్లు ద్వారా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. కొండచరియలు విరిగిపడటంతో బద్రీనాథ్, గంగోత్రి మార్గాలలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

మరిన్ని వార్తలు