200 బాణాసంచా దుకాణాలు దగ్ధం

21 Oct, 2014 19:44 IST|Sakshi

న్యూఢిల్లీ: హర్యానాలోని ఫరీదాబాద్ లో మంగళవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో దాదాపు 200 బాణాసంచా దుకాణాలు దగ్ధమయ్యాయి. దశారా మార్కెట్ లోని ఓ మైదానంలో ఏర్పాటు చేసిన బాణాసంచా దుకాణాల సముదాయంలో ఈ ప్రమాదం జరిగింది. ఓ దుకాణంలో చెలరేగిన మంటలు మిగతా దుకాణాలకు వ్యాపించడంతో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.

మంటల్లో బాణాసంచా పూర్తి తగలబడిపోయింది. ఫలితంగా పెద్ద సంఖ్యలో మంటలు ఎగిసిపడుతున్నాయి. కరెంట్ స్తంభాలు కాలిపోయాయి. మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. 18 అగ్నిమాపక వాహనాలతో మంటలను అదుపుచేస్తున్నారు. ప్రాణనష్టం సంభవించినట్టు సమాచారం లేదు. కోనుగోలుదారుల వాహనాలు మంటల్లో తగలబడిపోయినట్టు సమాచారం. అయితే ఎంత మేర ఆస్తి నష్టం సంభవించిందనేది మంటలు అదుపులోకి వచ్చాక గాని తెలియదు.

మరిన్ని వార్తలు