అత్యంత వేడి సంవత్సరంగా 2015

26 Jan, 2016 02:39 IST|Sakshi

జెనీవా: అత్యంత వేడి ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరంగా 2015 రికార్డుల్లోకెక్కింది. ఈ మేరకు అమెరికా వాతావరణ సంస్థ సోమవారం వెల్లడించింది. ఉష్ణోగ్రతల నడుమ భారీ వ్యత్యాసం నమోదైందని, ఎల్‌నినో ప్రభావమే ఇందుకు కారణమని పేర్కొంది. భారత్‌తోపాటు ప్రపంచ వ్యాప్తంగా భూతాపోన్నతికి దారి తీస్తోందని చెప్పింది. ఈ శతాబ్దంలో 2014లో కంటే 2015లోనే అత్యధిక వేడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 2011-15 మధ్య కాలం అత్యధిక వెచ్చని వాతావరణం కలిగిన ఐదేళ్ల వ్యవధిగా నమోదైందని అంతర్జాతీయ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంవో) తెలిపింది. 1961-1990 మధ్య కాలంలోని సగటు కంటే 2015లో 0.76 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగింది.

దీన్ని ప్రపంచవ్యాప్తంగా దీర్ఘకాలిక వాతావరణ మార్పుగా గుర్తించారు. ప్రపంచ వ్యాప్తంగా సాధారణ సగటు ఉష్ణోగ్రత (భూమి, సముద్రంపై కూడా) 14 సెల్సియస్ డిగ్రీలు. తొలిసారి ఒక సెల్సియస్ డిగ్రీ ఉష్ణోగ్రతలు దాటాయని డబ్ల్యూఎంవో సెక్రటరీ జనరల్ పెట్టెరి టాలస్ వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు