ఘోర ప్రమాదం, 23 మంది మృతి

1 Jan, 2017 18:21 IST|Sakshi
ఘోర ప్రమాదం, 23 మంది మృతి
జకర్తా: ఇండోనేషియాలో ఆదివారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జకర్తాలో ప్రయాణీకులతో వెళ్తున్న పడవలో ఉన్నట్టుండి మంటలు అంటుకోవడంతో 20 మంది మృతి చెందగా.. 17 మంది గల్లంతయ్యారు. గాయాలపాలైన 20 మందికి శస్త్రచికిత్స జరుగుతున్నట్లు చెప్పారు. మొత్తం 200 మంది ప్రయాణీకులతో బయల్దేరిన పడవలో టిడుంగ్ ఐల్యాండ్ వద్ద మంటలు చెలరేగినట్లు తెలిసింది. 
 
మంటల్లో పడవ మొత్తం కాలిపోగా.. ఫైబర్ తో తయారైనది కావడం వల్ల మునిగిపోలేదని అధికారులు చెప్పారు. పాసింజర్లలో ఎక్కువ మంది విదేశీయాత్రికులేనని తెలిపారు. ఘటన అనంతరం పడవను దగ్గరలోని పోర్టుకు తీసుకువెళ్లినట్లు వెల్లడించారు.
మరిన్ని వార్తలు