నదిలో 3.5 కోట్ల నగదు!

17 Nov, 2016 09:39 IST|Sakshi
నదిలో 3.5 కోట్ల నగదు!
గౌహతి : పెద్దనోట్లను రద్దుచేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో, బ్లాక్మనీని మార్చుకోవాలంటే మొహం చెల్లక చాలామంది ఆ నగదును మురికి కాల్వలో, నదుల్లో పారేస్తున్నారు. గౌహతిలోని రెండు విభిన్న ప్రాంతాలైన భరాలు నదిలో, ఓ డ్రైనేజీలో దాదాపు రూ.3.5 కోట్ల నగదును గుర్తించినట్టు పోలీసు అధికారులు చెప్పారు. నారెంగి రైల్వే స్టేషన్ సమీపంలోని డ్రైనేజీలో, దేశ రాజధానికి సమీపంలోని అనిల్ నగర్ ప్రాంతంలోని భరాలు నదిలో కొట్టుకుని పోతున్న ముక్కముక్కలుగా చినిగిపోయిన నగదును గుర్తించి, స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు.
 
అయితే ఈ చినిగిపోయిన నగదు, నిజమైన కరెన్సీ నోట్లా? కాదా? అనే దానిపై ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నామని పోలీసులు చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పెద్ద నోట్లు పనికిరాకుండా పోవడంతో, వీటిని ముక్కలుముక్కలుగా చేసి నదిలోకి విసిరినట్టు పోలీసులు భావిస్తున్నారు. మంగళవారం కూడా రూ.500, రూ.1000 నోట్లు గౌహతిలోని చందన్ నగర్, రుక్మిణిగాన్ ప్రాంతాల డ్రైనేజీలో కొట్టుకుపోతూ కనిపించాయని పోలీసులు పేర్కొన్నారు. 
మరిన్ని వార్తలు