చివరి అవకాశం..రేపటినుంచి ఇక అంతే..

31 Mar, 2017 18:18 IST|Sakshi
చివరి అవకాశం..రేపటినుంచి ఇక అంతే..

న్యూఢిల్లీ:  రూ.500,  రూ.1000 నోట్లు జమ నేటితో రద్దు.  రద్దైన పెద్దనోట్ల ఆర్‌బీఐ ప్రత్యేక కౌంటర్లలో డిపాజిట్లకు తుది గడువు నేటి (మార్చి31) తో ముగియనుంది.   గత ఏడాది నవంబర్‌ లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పెద్దనోట్లను రద్దుచేసి  సంచలనం సృష్టించారు. నల్లధనాన్ని అరికట్టేందుకు  ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు.  ఏప్రిల్‌ 1 నుంచి తాజాగా జారీ చేసిన  ఆదేశాల ప్రకారం  భారత పౌరులు  పాతనోట్లను కలిగి ఉండటం చట్టవిరుద్ధం.  నేరంగా పరిగణిస్తారు. ఈ ఉల్లంఘన రూ. 10,000 జరిమానా లేదా  పట్టుబడిన సొ‍మ్ముకు ఐదు రెట‍్లు వీటిలో  ఏది ఎక్కువ దాని పరిగణనలోకి తీసుకుంటారు.

అయితే ప్రవాస భారతీయుల (ఎన్నారైలు)  పాతనోట్ల మార్పిడికి  జూన్ 30కి గడువును ఇచ్చింది కేంద్ర బ్యాంకు. ఈ సౌకర్యం ముంబై, ఢిల్లీ, కోలకతా, చెన్నై, నాగ్పూర్ లో ఆర్బిఐ కార్యాలయాలలో మాత్రమే  అందుబాటులో ఉంది.  విదేశాలనుంచి వచ్చిన ఎన్‌ఆర్‌ఐలు  విమానాశ్రయంలోని కస్టమ్స్‌  అధికారులనుంచి  రెడ్‌ ఛానల్‌ సర్టిపికెట్‌ తెచ్చుకోవాల్సి ఉంది.   ఫెమా  నిబంధనల ప్రకారం ఈ పరిమితి ఒక వ్యక్తికి రూ. 25,000.  ఒకవేళ ఈ డిపాజిట్‌కు  కేంద్ర బ్యాంకు నిరాకరించిన విషయంలో,  14 రోజుల లోపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ సెంట్రల్ బోర్డ్ కు ఫిర్యాదు చేయవచ్చు. నేపాల్, భూటాన్, పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ లో ఉండే వారు ఈ సౌకర్యం ఉపయోగించుకోలేరు.

కాగా నవంబర్‌ 8న  డిమానిటైజేషన​ ప్రకటించిన కేంద్రప్రభుత్వం రద్దయిన పెద్దనోట్లను బ్యాంకులు స్వీకరించే గడువును జనవరి 30, 2017తో ముగించింది. అయితే రద్దయిన నోట్లను డిసెంబరు 30వ తేదీలోపు తమ అకౌంట్లలో డిపాజిట్‌ చేసుకోలేని వారు తగిన కారణాలను చూపి.. రిజర్వ్‌బ్యాంకు ప్రత్యేకించిన కౌంటర్లలో మార్చి 31వ తేదీ వరకు మార్పిడి  చేసుకునే అవకాశం ఇచ్చింది.   నగదు ఉపసంహరణపై అనేక ఆంక్షలు, పరిమితుల నేపథ్యంలో తీవ్ర నిరసన వ్యక‍్తంకావడంతో ఖాతాదారుల సౌలభ్యంకోసం  విడతలవారీగా కొన్ని వెసులు బాటును ప్రకటించింది.

మరోవైపు డిమానిటైజేషన్‌ 50 రోజుల్లో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి.  86శాతం చలామణిలో ఉన్న   పెద్దనోట్లను రద్దు చేయడంతో దేశవ్యాప్తంగా సంక్షోభం ఏర్పడింది. రద్దయిన నోట్లను నవంబరు 10వ తేదీ నుంచి బ్యాంకులు స్వీకరించడం ప్రారంభించాయి. దీంతో  అటు డిపాజిట్లకు, ఇటు నగదుకోసం ఏటీఎంల సెంటర్లదగ్గర, బ్యాంకుల వద్ద   ప్రజలుబారులు తీరారు. పనిచేయని  ఏటీఎంలు, నో క్యాష్‌  కోర్డులు వెక్కిరించడంతో  కొన్ని అవాంఛనీయ ఘటనలు, మరణాలు సంభవించిన సంగతి విదితమే.

>
మరిన్ని వార్తలు