350 బిలియన్ డాలర్లకు దేశీ టెక్, సర్వీసెస్ మార్కెట్!

5 Oct, 2015 23:51 IST|Sakshi
350 బిలియన్ డాలర్లకు దేశీ టెక్, సర్వీసెస్ మార్కెట్!

న్యూఢిల్లీ: భారత టెక్నాలజీ, సర్వీసెస్ మార్కెట్ పరిమాణం వచ్చే దశాబ్ద కాలంలో మరింత  విస్తరించనుంది. ఈ పెరుగుదలకు కొత్త ఆవిష్కరణలు, వాణిజ్య నిర్వహణ వంటి అంశాలు దోహదపడనున్నాయి. ఈ విషయం నాస్కామ్-మెకిన్సె నివేదికలో వెల్లడైంది. నివేదిక ప్రకారం.. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 132 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశీ టెక్నాలజీ, సర్వీసెస్ మార్కెట్ దాదాపు 10-11% వృద్ధితో 2020 నాటికి 225 బిలియన్ డాలర్లకు, 2025 నాటికి 350 బిలియన్ డాలర్లకు పెరుగుతుం దని అంచనా. డిజిటల్ టెక్నాలజీ వినియోగం పెరుగుతుండటంతో గ్లోబల్ టెక్నాలజీ, బిజినెస్ సర్వీసులు 2025 నాటికి 3.6% సగటు వార్షిక వృద్ధి రేటుతో 4 ట్రిలియన్ డాలర్లకు చేరవచ్చు. దేశీ టెక్ పరిశ్రమ రెండంకెల వృద్ధిని సాధించడానికి అపార అవకాశాలు ఉన్నాయని నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్.చంద్రశేఖర్ పేర్కొన్నారు.

టెక్ కంపెనీలు డిజిటల్ సర్వీసులకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందని మెకిన్సె ఇండియా మేనే జింగ్ డెరైక్టర్ నొషిర్ తెలిపారు. వ్యాపార అనుకూల పరిస్థితుల కల్పనకు పన్ను విధానం తదితర అంశాల్లో మార్పు రావాల్సి ఉందని నాస్కామ్ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
 
 నాస్కామ్-మెకిన్సె నివేదిక
 

మరిన్ని వార్తలు