కొండచరియలు విరిగిపడి 36 మంది దుర్మరణం

20 Aug, 2014 19:25 IST|Sakshi
బురదలో కూరుకుపోయిన, కొట్టుకుపోతున్న ఇళ్లు

టోక్యో:    పశ్చిమ జపాన్‌లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. హిరోషిమా ప్రాంతంలో కుండపోతగా వర్షాలు కురవడంతో  కొండచరియలు విరిగిపడి  32 మంది దుర్మరణం చెందారు. మరో 7 మంది గల్లంతయ్యారు. హిరోషిమా ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో   ఇళ్లు  పెద్ద సంఖ్యలో నేలమట్టమయ్యాయని అధికారులు తెలిపారు. వరదలా ప్రవహించిన బురద ఇళ్లను చుట్టుముట్టింది. కొన్ని ఇళ్లు ఆ బురద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. బాధిత ప్రాంతాల్లో రక్షణ సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే సూచనలున్నాయని హిరోషిమా పోలీసులు తెలిపారు.

 సంఘటనా స్థలంలో రక్షణ సిబ్బందికి చెందిన 53 ఏళ్ల వ్యక్తి  ఐదుగురి ప్రాణాలను కాపాడారు. అయితే ఆ వెంటనే మరోసారి కొండచరియ విరిగి మీద పడటంతో అతను ప్రాణాలు కోల్పోయారు.  కూలిన ఇళ్ల శిథిలాల కింద ప్రాణాలతో ఎవరైనా మిగిలి ఉంటే వారిని రక్షించేదుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

మరిన్ని వార్తలు