మానసిక ఆందోళన ప్రైవేట్ ఉద్యోగుల్లోనే అధికం!

7 Apr, 2015 01:27 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో దాదాపు 42.5 శాతం ప్రైవేట్ ఉద్యోగులు ఎక్కువ షెడ్యూళ్లు, అధిక ఒత్తిడి తదితర కారణాల వల్ల పలు మానసిక ఆందోళనలతో బాధపడుతున్నట్లు అసోచామ్ తెలిపింది. దాదాపు 18 రంగాలకు చెందిన 150 కంపెనీలకు సంబంధించిన 1,250 మంది ప్రైవేట్ ఉద్యోగులు అసోచామ్ నిర్వహించిన సర్వేలో పాల్గొన్నారు. సర్వే ప్రకారం, మానసిక ఆందోళనల బారిన పడుతున్న ప్రైవేట్ రంగ ఉద్యోగుల సంఖ్య దేశ రాజధాని ఢిల్లీలో అధికంగా ఉంది. దీని తర్వాత బెంగుళూరు, ముంబై, అహ్మదాబాద్, చండీగఢ్, హైదరాబాద్, పుణేలు ఉన్నాయి.‘పోటీ ప్రపంచంలో మనుగడ సాగించటానికి అవసరమైన ఉద్యోగాలను కాపాడుకోవాలనే ధ్యాసలో ప్రైవేట్ ఉద్యోగులు అధిక ఒత్తిడికి గురవుతున్నారు’ అని అసోచామ్ జనరల్ సెక్రటరి  రావాత్ అన్నారు.
 
 మహిళల్లోనే స్థూలకాయం ఎక్కువ!
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అనారోగ్యానికి, దీర్ఘకాలిక వ్యాధులకు కారణమయ్యే ఊబకాయం మహిళల్లోనే ఎక్కువ కనిపిస్తోందంటోంది హైదరాబాద్‌కు చెందిన ప్రివెంటివ్ హెల్త్‌కేర్ సంస్థ అయిన ఈకిన్‌కేర్.కామ్. నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ‘పర్సనల్ హెల్త్ రికార్డ్ అకౌంట్’ను ఈకిన్‌కేర్.కామ్ ఫౌండర్, సీఈఓ కిరణ్ కే కలకుంట్ల సోమవారమిక్కడ ఆవిష్కరించారు. ‘ప్రస్తుతం ఈకిన్‌కేర్.కామ్ సేవల్ని 1,500 మందికి పైగా యూజర్లు వినియోగిస్తున్నారు. ఇందులో 70 శాతం మంది 20-30 ఏళ్ల వయస్సు వారే’ అని ఈ సందర్భంగా  అన్నారు. మెడికల్ రికార్డుల్ని భద్రపర్చే సేవల్ని ఈకిన్‌కేర్.కామ్ అందిస్తోంది.
 

మరిన్ని వార్తలు