గతేడాది 43 % వీసాలను మంజూరు చేశాం: అమెరికా కాన్సులేట్

26 Nov, 2013 18:51 IST|Sakshi

వడోదరా: గతేడాది భారతీయ విద్యార్థులకు 43% వీసాల కేటాయించామని యూఎస్ వైస్ కాన్సులెట్ జెస్సీ వాల్తర్ తెలిపారు. సోమవారం ఓ ప్రైవేటు కార్యక్రమంలో పొల్గొన్న ఆయన అమెరికా వీసా విధివిధానాలపై వివరణ ఇచ్చారు. బీ-1, బీ-2, ఎఫ్-1 సవరణలు చేయడంతో ఇది సాధ్యపడిందని తెలిపారు  గత సంవత్సరం భారతీయులకు ఆరు లక్షలపైగా అమెరికా వీసాలు మంజూరు చేశామన్నారు.

 

భారతీయ విద్యార్థులకు అమెరికా వీసా కేటాయింపులు పెరిగడంతో లక్షలాది మంది విద్యార్థుల లక్ష్యమైన అమెరికా చదువుకు మరింత అవకాశం పెరిగింది.  నిరుడు అక్టోబరు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 5600 స్టూడెంట్ వీసాలను అమెరికా జారీ చేసింది. అంతకుముందు కంటే ఇది 50 శాతం ఎక్కువ.  2012 నివేదిక ప్రకారం 2011- 12 లో అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య 3.5 శాతం తగ్గింది. కానీ ఆ తర్వాతి క్రమేపీ  పుంజుకుంది.

 

అమెరికాలో ప్రస్తుతం 1,00,270 మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నారు. భారతీయ విద్యార్థుల స్పందన సానుకూలంగా ఉందని, ఈ పరిణామం తమకు సంతోషకరమని అమెరికా కాన్సులేట్ అధికారులు చెబుతున్నారు.

>
మరిన్ని వార్తలు