2016లో మేజర్ డేటా ట్రాఫిక్ ఇదే!

24 Mar, 2017 09:31 IST|Sakshi
2016లో మేజర్ డేటా ట్రాఫిక్ ఇదే!
న్యూఢిల్లీ : 4జీ.. డేటా వాడకానికి ప్రస్తుతం ఇది మేజర్ సోర్స్. స్మార్ట్ ఫోన్, టాబ్లెట్, ల్యాప్ టాప్ వంటి అన్ని ఇంటర్నెట్ డివైజ్ లకు దీన్ని వాడకం విపరీతంగా పెరిగిపోయింది. కంపెనీలు సైతం 4జీ డివైజ్ ల తయారీపై ఎక్కువగా మొగ్గుచూపుతున్నాయి. 2జీ, 3జీలను వెనక్కి నెట్టేసిన 4జీ 2016లో ప్రధాన డేటా ట్రాఫిక్ గా నిలిచినట్టు వెల్లడైంది. 2016లో దేశమంతా 4జీ సేవలనే ఎక్కువగా వినియోగించుకున్నారని తెలిసింది. తాజా రిపోర్టుల ప్రకారం 2015 నుంచి పెరిగిన పే లోడ్లో 60శాతం 4జీనే కంట్రిబ్యూట్ చేసినట్టు తెలిసింది. ఇండియాలో మొబైల్ బ్రాండుబ్యాండు ఫర్ఫార్మెన్స్ పై నోకియా ఎంబిట్ ఇండెక్స్ నివేదించిన రిపోర్టులో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
 
ఇంకా అన్ని సర్కిళ్లలో 4జీ కవరేజ్ రానప్పటికీ,  మొత్తం డేటా ట్రాఫిక్ ప్యాన్ ఇండియాలో ఇది 13 శాతం నమోదైంది. మెట్రోల్లేనే ఎక్కువగా 4జీని వాడుతున్నారని , అక్కడ డేటా ట్రాఫిక్ లో 4జీ కంట్రిబ్యూషన్ 26 శాతం ఉన్నట్టు తేలింది. ఈ రిపోర్టు ప్రకారం ఒక్క సబ్స్క్రైబర్ వాడే నెలవారీ 4జీ డేటా వాడకం 1,400 ఎంబీకంటే పైనే ఉందని తెలిసింది. అదే 3జీ వాడకం చూస్తే అది కేవలం 850ఎంబీ మాత్రమే ఉన్నట్టు రిపోర్టు తెలిపింది. గతేడాది కంటే 4జీ ఎనాబుల్డ్ స్మార్ట్ ఫోన్లు 2.7 సార్లు పెరిగాయని రిపోర్టు వెల్లడించింది. కేవలం 1.2 సార్లే 3జీ ఎనాబుల్డ్ స్మార్ట్ ఫోన్లు పెరుగుతున్నాయని రిపోర్టు పేర్కొంది. 
మరిన్ని వార్తలు