నేపాల్లో మళ్లీ భూకంపం

10 Apr, 2017 13:32 IST|Sakshi

కఠ్మాండు: భారీ భూకంపం బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నేపాల్ మరోసారి భయం గుప్పిట్లోకి జారుకుంది. గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత భూకంపం సంభవించింది. కఠ్మాండుకు 65 కిలో మీటర్ల దూరంలోని సింధుపాల్ చౌక్ జిల్లాలో ఇది చోటుచేసుకుంది. రిక్టర్ స్కేలు పై ఈ భూకంప తీవ్రత 5.3గా నమోదై కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది.

దీంతో ప్రజలకు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. కొందరు భయంతో బయటకు పరుగులు తీశారు. అయితే, ఎలాంటి ఆస్తి ప్రాణనష్టం చోటుచేసుకోలేదని అధికారులు తెలిపారు. గత ఏప్రిల్ 25న భారీ భూకంపం సంభవించి దాదాపు పదివేల మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు