పెరూలో భూకంపం; ఇళ్లు, రోడ్లు ధ్వంసం

12 Dec, 2016 15:08 IST|Sakshi

లిమా: పెరూలో గురువారం భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ‍్రత 5.5గా నమోదైంది. భూప్రకంపనలకు ఇళ్లు, రోడ్లు ధ్వంసమయ్యాయి. కాగా ఎక్కడా ప్రాణనష్టం జరిగినట్టు సమాచారం లేదు.

పెరూలో లంపా పట్టణానికి 58 కిలో మీటర్ల దూరంలో 30 కిలో మీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. 30 సెకన్ల పాటు భూప్రకంపనలు వచ్చాయి. దీంతో జనం భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు చెప్పారు. లంపా, పరాటియా జిల్లాలో చాలా ఇళ్లు దెబ్బతిన్నాయి. పెరూలో ఏడాదికి దాదాపు 200 భూకంపాలు వస్తుంటాయి. వీటిలో చాలావరకు ప్రజలు గుర్తించని అతిస్వల్ప ప్రకంపనలు ఉంటాయి. పెరూలో చివరిసారిగా 2007లో వచ్చిన భారీ భూకంపంలో 595 మంది మరణించారు.

మరిన్ని వార్తలు