బిహార్ మూడో దశలో 53 శాతం పోలింగ్

29 Oct, 2015 03:32 IST|Sakshi

 పట్నా: 50 నియోజకవర్గాల్లో బిహార్ అసెంబ్లీ మూడో దశ ఎన్నికల పోలింగ్ బుధవారం ముగిసింది. 53.32% పోలింగ్ నమోదైంది. ఇది మొదటి, రెండో దశల పోలింగ్ శాతం కన్నా తక్కువ. ఈ దశలోనూ పురుషుల(52.5%) కన్నా మహిళలే(54%) ఉత్సాహంగా ఓటేశారు. బక్సర్‌లో అత్యధికంగా 56.58%, పట్నాలో అత్యల్పంగా 51.82% ఓటింగ్ జరిగినట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి అజయ్ వీ నాయక్ తెలిపారు. సరన్ జిల్లాలో 123 ఏళ్ల వృద్ధురాలు ఓటుహక్కును వినియోగించుకుందన్నారు.

భక్తియార్‌పూర్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ఓటేశారు. ఈ ప్రాంతంలో సరైన వైద్యం అందని కారణంగా ఒక బాలిక మృతి చెందిన విషయమై ఆయన కొంత నిరసనను ఎదుర్కొన్నారు. గవర్నర్ రామ్ నాథ్ కోవింద్ దంపతులు, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్, ఆయన భార్య రబ్రీదేవీ తదితరులు ఓటేశారు.

మరిన్ని వార్తలు