అదృష్యమైన భారతీయ విద్యార్ధి ఆచూకీ తెలిపితే15 వేల డాలర్లు

17 Feb, 2014 23:10 IST|Sakshi

న్యూయార్క్: అమెరికా రాష్ట్రం ఇల్లినాయిస్ లో ఫిబ్రవరి 12 తేదిన అదృష్యమైన భారతీయ విద్యార్ధి ఆచూకీని తెలిపితే 15 వేల డాలర్లను బహుమతిగా ఇస్తామని బాధిత కుటుంబం ప్రకటించింది. సదరన్ ఇల్లినాయిస్ యూనివర్సిటీలో క్రిమినల్ జస్టిస్ విద్యను అభ్యసిస్తున్న ప్రవీణ్ ఎం వర్గీస్ ఫిబ్రవరి 12 తేదిన రాత్రి 11 గంటల తర్వాత కనిపించకుండా పోయినట్టు షికాగో ట్రిబ్యున్ కథనంలో వెల్లడించింది. 

తన సోదరుడు ఫిబ్రవరి 13 తేది మధ్యాహ్నం 12.30 గంటలకు షికాగో నగరంలోని తన స్నేహితుడికి పోన్ చేసినట్టు కాల్ డేటా వెల్లడించిందని ప్రియావర్గీస్ తెలిపింది. ఎవరితోనో గొడవ పెట్టుకుంటూ పరిగెత్తినట్టు తన సోదరుడు స్నేహితుడొకరు తెలిపారని ప్రియా చెప్పారు.

' జరుగుతుందో అర్ధం కావడం లేదు' అనే సందేశాలు ఫిబ్రవరి 12 తేది 11.06 నిమిషాలకు ట్విటర్ లో పోస్ట్ చేసినట్టు తెలుసుకున్నామని ప్రియా తెలిపింది. 

మరిన్ని వార్తలు