పాకిస్థాన్ను వణికించిన భూకంపం

14 Jun, 2014 13:27 IST|Sakshi

పాకిస్థాన్లోని వాయవ్య ప్రాంతంలో పెను భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.6గా నమోదైంది. దీంతో ప్రజలు భయకంపితులయ్యారు. భూకంప కేంద్రం అఫ్ఘానిస్థాన్లోని హిందూకుష్ పర్వతాల్లో ఉంది. ఇది ఖైబర్-ఫక్తుంఖ్వా రాష్ట్ర రాజధాని పెషావర్, చుట్టుపక్కల ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపించింది. అయితే, ప్రభావిత ప్రాంతాల్లో ఎవరూ మృతి చెందినట్లు మాత్రం సమాచారం అందలేదు.

50 కిలోమీటర్ల లోతులో భూకంపం నమోదైందని పాకిస్థాన్ వాతావరణ శాఖ తెలిపింది. మన్షేరా, చిత్రాల్, బజౌర్, మింగోరా, మాలాకండ్ జిల్లాల్లో కూడా భూకంప ప్రభావం ఉంది. కాగా, పాక్ నైరుతి దిశలోని బెలూచిస్థాన్ ప్రాంతంలో 5.3 తీవ్రతతో శుక్రవారంనాడే ఓ భూకంపం వచ్చింది. 2005లో 7.6 తీవ్రతతో వచ్చిన భూకంపంలో దాదాపు 74వేల మంది మరణించారు.

మరిన్ని వార్తలు