70 శాతం తగ్గిన పుత్తడి ఆభరణాల ఎగుమతులు

24 Aug, 2013 03:17 IST|Sakshi
70 శాతం తగ్గిన పుత్తడి ఆభరణాల ఎగుమతులు

న్యూఢిల్లీ: భారత్ బంగారు అభరణాల ఎగుమతులు గత నెలలో 70 శాతం తగ్గాయని జెమ్స్ అండ్ జ్యూయలరీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్(జీజేఈపీసీ) తెలిపింది. బంగారం కొరతగా ఉండడం, దేశీయ మార్కెట్లో పరిమిత నిల్వల కారణంగా పుత్తడి ఆభరణాల ఎగుమతులు 70 శాతం క్షీణించి 44.14 కోట్ల డాలర్లకు తగ్గాయని జీజేఈపీసీ చైర్మన్ విపుల్ షా తెలిపారు. జీజేఈపీసీ వెల్లడించిన వివరాల ప్రకారం....,
 
     గత ఏడాది జూలైలో 150 కోట్ల డాలర్ల బంగా రం ఎగుమతులు జరిగాయి.
     బంగారం మెడళ్లు, నాణాలు ఎగమతులు 63 శాతం క్షీణించి 11.28 కోట్ల డాలర్లకు తగ్గాయి.
 
     అయితే వెండి ఆభరణాల ఎగుమతులు మాత్రం జోరుగా పెరిగాయి. ఈ ఎగుమతులు 184% వృద్ధితో 11 కోట్ల డాలర్లకు పెరిగాయి.
 
     మొత్తం మీద భారత దేశ రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 17% క్షీణించి 249 కోట్ల డాలర్లకు తగ్గాయి. ఈ ఏడాది ఏప్రిల్    -జూలై కాలానికి ఈ ఎగుమతులు 14 శాతం క్షీణించి 1,100 కోట్ల డాలర్లకు చేరాయి.
 
     {పభుత్వం బంగారం దిగుమతులపై ఆంక్షలు విధించడంతో ఆభరణాల తయారీకి అవసరమైన పుత్తడి కొరత తీవ్రంగా ఉంది.
 
     {పపంచంలోనే అత్యధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకునే దేశం మనదే.

మరిన్ని వార్తలు