గతేడాది 75 వేల మంది మృతి

3 Sep, 2015 09:07 IST|Sakshi
గతేడాది 75 వేల మంది మృతి

న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదాల్లోయువత బతుకు ఛిద్రమవుతోంది. రహదారులపై జరుగుతున్న దుర్ఘటనల్లో యువతీ యువకులు ఎక్కువగా ప్రాణాలు కోల్పోతుండడం తీవ్రాందోళన కలిగిస్తోంది. గతేడాది రోడ్డు ప్రమాదాల్లో 75 వేల మంది మృతి చెందారు. వీరంతా 15 నుంచి 34 ఏళ్ల వయసు కలిగిన వారని ఉపరితల రవాణా, జాతీయ రహదారుల కేంద్ర మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి.

రోడ్డు మృతుల్లో 82 శాతం మంది పురుషులు. 2014 సంవత్సరంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 4.89 లక్షల మంది మృతి చెందగా, అందులో 53.8 శాతం యువత. 35 నుంచి 64 ఏళ్ల వయసున్న వారు 35.7 శాతం మంది ఉన్నారు. అతివేగం, ఓవర్ లోడింగ్, మద్యంమత్తు, హిట్ అండ్ రన్ కారణంగా రోడ్డు ప్రమాదాలు అధికమవుతున్నాయి.

>
మరిన్ని వార్తలు