755 కొత్త పోస్టుల మంజూరు

20 Jan, 2016 05:27 IST|Sakshi
755 కొత్త పోస్టుల మంజూరు

సాక్షి, హైదరాబాద్: వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీలో వివిధ పోస్టుల మంజూరుకు రాష్ర్ట ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. వివిధ హోదాల్లో 82 రెగ్యులర్ పోస్టులతో పాటు 22 అవుట్ సోర్సింగ్ పోస్టులు మంజూరు చేసినట్లు ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్ మంగళవారం ఉత్తర్వుల్లో తెలిపారు. జాయింట్ రిజిస్ట్రార్ (2), కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్, డెరైక్టర్(పబ్లికేషన్స్), చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, డిప్యూటీ రిజిస్ట్రార్ (3), రీజనల్ కో ఆర్డినేటర్, డిప్యూటీ డెరైక్టర్/డిప్యూటీ రిజిస్ట్రార్ (అకడమిక్), డిప్యూటీ డెరైక్టర్/డిప్యూటీ రిజిస్ట్రార్(అడ్మిషన్స్), డిప్యూటీ డెరైక్టర్/డిప్యూటీ రిజిస్ట్రార్(ఎగ్జామ్స్), ఫైనాన్స్ ఆఫీసర్(డిప్యూటీ రిజిస్ట్రార్ కేడర్), యూనివర్సిటీ ఇంజనీర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ (7), సీనియర్ సిస్టమ్ అనలిస్ట్, అసిస్టెంట్ ఇంజనీర్/సెక్షన్ ఆఫీసర్, పీఎస్ టు వైస్ చాన్స్‌లర్, సూపరింటెండెంట్స్ (12), డ్రాట్స్‌మెన్, సీనియర్ అసిస్టెంట్స్ (15), వీసీకి పీఏ  (సీనియర్ స్టెనోగ్రాఫర్), జాయింట్ రిజిస్ట్రార్ పీఏ (సీనియర్ స్టెనోగ్రాఫర్), జూనియర్ అసిస్టెంట్స్ (15), లైబ్రేరియన్, అసిస్టెంట్ లైబ్రేరియన్ (2), స్టాటిస్టికల్ ఆఫీసర్, డెరైక్టర్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, ప్రోగ్రామర్, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, జూనియర్ స్టెనోగ్రాఫర్ (4), ట్రేసర్స్, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులున్నట్లు పేర్కొన్నారు.

వీటితో పాటు అవుట్ సోర్సింగ్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్, సిస్టమ్స్ అడ్మినిస్ట్రేటర్, ఆఫీస్ సబార్డినేట్(18), ఎలక్ట్రీషియన్ కమ్ జనరేటర్ ఆపరేటర్, ప్లంబర్ పోస్టులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. కాగా, వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రిలో 147 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. వైద్య ఆరోగ్య శాఖ పంపించిన ప్రతిపాదనలకు పరిశీలించి కొత్త పోస్టులకు ఆమోదం తెలుపుతూ తెలంగాణ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పిడియాట్రిక్ ఐసీయూ, నియోనాటల్ ఐసీయూ, మెట ర్నల్ ఐసీయూ, అనస్థీషియా యూనిట్‌లో వివిధ పోస్టులతో పాటు ఇతర పారామెడికల్ పోస్టులను మంజూరు చేసింది.
 
మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీకి 462 పోస్టులు
మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీకి 462 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. కాలేజీ సూపరింటెండెంట్ కార్యాలయానికి 55, ప్రిన్సిపల్ ఆఫీసుకు 24, క్లినికల్ స్పెషాలిటీ విభాగానికి 302, నాన్ క్లినికల్ స్పెషాలిటీ విభాగానికి 81 పోస్టుల మంజూరుకు ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వం పేర్కొంది.
 
అటవీ శాఖలో 42 పోస్టులు..
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీలో విలీనమైన ఖమ్మం జిల్లాకు చెందిన ఏడు మండలాల్లోని ఉద్యోగులను సర్దుబాటు చేసేందుకు అటవీ శాఖలో 42 సూపర్ న్యూమరీ పోస్టులను ప్రభుత్వం సృష్టించింది. వీటికి అమోదం తెలుపుతూ ఆర్థిక శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఐదు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్, 18 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, 4 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, 9 అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, 2 సీనియర్ అసిస్టెంట్, 4 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు సృష్టించారు.

మరిన్ని వార్తలు