కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు గుడ్‌ న్యూస్‌

4 May, 2017 10:06 IST|Sakshi
కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు గుడ్‌ న్యూస్‌

న్యూఢిల్లీ:  ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న లక్షలాది కేంద్ర  ప్రభుత్వం పెన్షన​ దారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. 7వ పే కమిషన్‌ సిఫారసులు కేంద్ర  కేబినెట్‌ బుధవారం ఆమోదించింది.  ఉద్యోగుల వేతనం, పెన్షనరీ లాభాలపై కొత్త పెన్షన్ పథకానికి కి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సెంట్రల్ పే కమిషన్ సిఫారసులపై మార్పులతో లావాసా   కమిటీ ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదించింది . ఈ మేరకు 55 లక్షలమంది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు లబ్ది పొందనున్నారు. 

2016-17 నాటికి రూ .84,933 కోట్ల అదనపు ఖర్చుతో కేబినెట్ సిఫార్సులను అమలు చేసేందుకు మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. (2015-16 రెండు నెలలు బకాయిలు సహా).   7వ వేతన సంఘం సిఫారసుల సమీక్షకు  ఏర్పాటైన ఆర్థికకార్యదర్శి అశోక్ లావాసా నేతత్వంలో ఏర్పాటైన కమిటీ తన తుది నివేదికను ఆర్థికమంత్రి  అరుణ్ జైట్లీ కి ఏప్రిల్‌ 27న సమర్పించింది.   జనవరి 1,  2016 నుంచి అమలు చేయనున్నారు.  దీంతో కేంద్ర ప్రభుత్వ ఖజనాకు  రూ. 29,300 కోట్ల భారం పడనుందని అంచనా.

క్యాబినెట్ ఆమోదం పొందిన తరువాత, కేంద్ర ప్రభుత్వ వార్షిక పింఛను బిల్లు రూ .1,76,071 కోట్లకు పెరిగే అవకాశం ఉంది. అలాగే డిఫెన్స్ పెన్షనర్ల  డిసేబులిటీ పెన్షన్‌కు సంబంధించిన సిఫారసులను కూడా కేబినెట్‌ ఆమోదించింది.

కాగా బేసిక వేతనం, పెన్షన్ పెంచడంతపాటు,  మొత్తం 196 భత్యాలలో 53 తీసివేయాలని, మరో 36 భత్యాలను కలపాలని  7వ వేతన సంఘం సిఫారసు చేసింది.  వీటిపై అసంతృప్తి వ్యక్తం కావడంతో ప్రభుత్వం గత ఏడాది లావాసా కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు