ప్రభుత్వ షాపింగ్ లిస్టు చాలా పెద్దదే...

8 Nov, 2016 09:38 IST|Sakshi
ప్రభుత్వ షాపింగ్ లిస్టు చాలా పెద్దదే...
న్యూఢిల్లీ : మేడ్ ఇన్ ఇండియా మిలటరీ హార్డ్వేర్ కొనుగోలకు ప్రభుత్వం భారీ మొత్తంలో ఖర్చుచేసేందుకు సిద్ధమైంది. 83 తేలికపాటి తేజాస్ యుద్ధవిమానాలు, 15 తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లు, 464 టీ-90 ట్యాంక్స్ కొనుగోలుకు రక్షణ మంత్రిత్వ శాఖ ప్యానెల్ సోమవారం ఆమోదముద్ర వేసింది. తేజాస్ తయారీదారి హిందూస్తాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి ఇప్పటికే 40 ఎయిర్క్రాప్ట్ల కొనుగోలుకు ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. ఈ ఏడాది అవి ఇండియన్ ఎయిర్ఫోర్స్కు డెలివరీ కానున్నాయి.
 
నిన్న ఆమోదముద్ర వేసిన తేజాస్ కొనుగోలుకు ప్రభుత్వం దాదాపు రూ.50,025 కోట్లు ఖర్చు చేయనుంది. ఆర్మీ, వైమానికదళం కోసం కొనుగోలు చేస్తున్న హెలికాప్టర్ల వ్యయం రూ.2,911 కోట్లు, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నుంచి తెప్పిస్తున్న ట్యాంకుల ఖర్చు రూ.13,448 కోట్లుగా ఉంది. అంతేకాక, భారత ఆర్మీ కోసం  598 మినీ మినీ మానవరహిత వైమానిక వాహనం లేదా డ్రోన్స్ కొనుగోలుకు కూడా డిఫెన్స్ అక్విషిషన్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. 
 
ఎయిర్ ఫోర్స్ ఈ ఏడాది జూలైలో రెండు యుద్ధ విమానాల కొనుగోలుతో తేజాస్ స్క్వాడ్రాన్ల సంఖ్యను పెంచింది.తేజాస్లో లోపాలున్నప్పటికీ,  ఈ ‍ప్రొగ్రామ్ను ఎప్పటికీ ఉండేలా, యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు 2015లో ఇండియన్ ఎయిర్ఫోర్స్ అంగీకరించింది. ఈ నేపథ్యంలోనే తేజాస్ ‍యుద్ధవిమానాలను కొనుగోలు చేస్తూ స్క్వాడ్రాన్ల సంఖ్యను పెంచుతూ ఉంది. 83 తాజా తేజాస్ ఫైటర్స్తో మొత్తం ఈ జాబితా 120కు చేరుకోనుంది. ఈ డెలివరీ హెచ్ఏఎల్ ఉత్పత్తి సామర్థ్యంపై డెలివరీ ఆధారపడి ఉండనుంది.వీటి కోసం ప్రస్తుతం భారత వైమానిక దళం కొత్త పైలెట్లను నియమిస్తూ వారికి శిక్షణ కూడా ఇస్తోంది. 
మరిన్ని వార్తలు