మద్యం ఆపకుంటే యమునా నదిలో దూకుతా

16 Aug, 2015 19:38 IST|Sakshi

ఆగ్రా: గాంధీ జయంతినాటికి మద్యం అమ్మకం నిషేధించకుంటే తాను యమునా నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటానని ఓ 96 ఏళ్ల స్వాతంత్ర్య సమరయోథుడు అల్టిమేటం జారీ చేశాడు. ఎవరైనా తన బెదిరింపును ఖాతరు చేయకుంటే మద్యం అమ్మే షాపులను తగులబెట్టేందుకైనా వెనుకాడనని హెచ్చరించారు. ఆదివారం ఆగ్రా వీధుల్లో మద్యం నిషేధం కోసం డిమాండ్ చేస్తూ కొందరు మహిళలు, యువకులు ర్యాలీలు తీయగా వాటిలో చిమ్మాన్ లాల్ జైన్ (96) అనే స్వాతంత్ర్య సమర యోధుడు పాల్గొన్నాడు.

మద్యం ఎన్నో కుటుంబాలను కూల్చి వేస్తుందని, వారి జీవిత విధానాన్ని ధ్వంసం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. 'దేశాన్ని కాపాడండి. సిగ్గు తెచ్చుకోండి. ఆడ కూతుర్లను రక్షించండి' అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. 68 ఏళ్ల కిందట స్వాతంత్రం పొందిన రోజు ఆగ్రాలో కేవలం 11 లిక్కర్ షాపులు ఉండేవని, ప్రస్తుతం మాత్రం 1,100కు చేరుకున్నాయని తెలిపారు. మద్యానికి చేసే ఖర్చును ఒక్కసారి ఆపేసి ఆలోచిస్తే సామాన్య కుటుంబాలకు జీవనాధారమవుతుందని మరువరాదని అన్నారు.

మరిన్ని వార్తలు