2 విమానాశ్రయాల్లో పూర్తిస్థాయి స్కానర్లు

2 Dec, 2013 02:06 IST|Sakshi

 ముంబై: విమానాశ్రయాల్లో ప్రయాణికుల శరీర భాగాలను పూర్తి స్థాయిలో స్కానింగ్ చేసే యంత్రాలను రెండు ఎయిర్‌పోర్టుల్లో ప్రవేశపెట్టాలని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. మిల్లీ మీటర్ వేవ్ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే ఈ స్కానర్లు ప్రయాణికుల దేహాన్ని పూర్తిగా స్కానింగ్ చేస్తాయి. ప్రస్తుతం ఎయిర్‌పోర్టుల్లో డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు, చేతితో వినియోగించే స్కానింగ్ పరికరాలను వాడుతున్నారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని 125 విమానాశ్రయాల్లో ఎక్కడా ప్రయాణికుల దేహాలను సంపూర్ణంగా స్కా నింగ్ చేసే యంత్రాల్లేవు. 2010లో ఢిల్లీ విమానాశ్రయంలో పూర్తిస్థాయి స్కానర్లను ప్రవేశపెట్టగా ప్రయాణికుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. వేవ్ టెక్నాలజీ స్కానర్లతో వ్యక్తిగత అంశాలకు ఇబ్బంది ఉండదని అవి ప్రయాణికుల శరీర ఆకృతిని బహిర్గతం చేయకుండా కేవలం సాధారణ చిత్రాలను మాత్రమే అందచేస్తాయని చెబుతున్నారు. ఏ విమానాశ్రయాల్లో వీటిని అమర్చాలో ఇంకా నిర్ణయించలేదు.
 

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు