ఆప్.. తుస్!

11 Mar, 2017 14:27 IST|Sakshi
ఆప్.. తుస్!

న్యూఢిల్లీ: రెండో రాష్ట్రంలో పాగా వేయాలన్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఆశలు ఫలించలేదు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో పోటీ చేసిన ఆప్ కు ఆశాభంగం ఎదురైంది. పంజాబ్ లో పాగా వేస్తుందనుకున్న ఆప్ చివరకు రెండో స్థానంతో సరిపెట్టుకుంది. గోవాలో ఖాతాలో కూడా తెరలేకపోయింది. పంజాబ్ లో ఆప్ రెండో స్థానంలో నిలుస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యాయి. అధికార అకాలీదళ్‌-బీజేపీ కూటమి మూడో స్థానానికి పడిపోయింది.

పంజాబ్, గోవా రాష్ట్రల్లో తమ పార్టీ సమానంగా దెబ్బతిందని ఆప్ సీనియర్ నాయకుడు సోమనాథ్‌ భారతి పేర్కొన్నారు. ఇది తమకు గొప్ప అనుభవమని, ఎక్కడ తప్పు జరిగిందో విశ్లేషించుకుంటామని చెప్పారు. తాము కొత్త తరహాలో రాజకీయాలకు శ్రీకారం చుట్టామని, హార్డ్ వర్క్ ను నమ్ముకున్నామని అన్నారు. పంజాబ్, గోవా ఎన్నికల ఫలితాలు తమకు నిరాశ కలిగించాయని, లోపాలను సరిదిద్దుకుంటామని ఆప్ నేత అశుతోష్‌ తెలిపారు. కాగా, ఎన్నికల ఫలితాలపై విశ్లేషించుకునేందుకు ఆప్ నాయకులు ఢిల్లీలోని కేజ్రీవాల్ నివాసంలో సమావేశమయ్యారు.

మరిన్ని వార్తలు