కిరణ్‌రావుది వనపర్తేనా!

27 Nov, 2015 05:44 IST|Sakshi
కిరణ్‌రావుది వనపర్తేనా!

వనపర్తి: ‘దేశంలో అసహనం పెరిగిపోతోంది’ అంటూ బాలీవుడ్ నటుడు ఆమిర్‌ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయన  భార్య కిరణ్‌రావు మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి సంస్థానాదీశులకు సంబంధించిన వారు అన్న అంశం గురువారం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. కిరణ్‌రావు.. వనపర్తి సంస్థానంలోని చివరిరాజు, మాజీ ఎంపీ అయిన రాజారామేశ్వర్‌రావు భార్య శాంతారామేశ్వర్‌రావు తమ్ముడు సీఎంఎస్ రావు మనవరాలిగా వనపర్తిలోని రాజారామేశ్వర్‌రావు ట్రస్ట్ సిబ్బంది వెల్లడిస్తున్నారు.

అయితే ఆమెగానీ, ఆమె తల్లిదండ్రులుగానీ ఇక్కడికి వచ్చిన దాఖలాలు లేవు. రాజా రామేశ్వర్‌రావు కొన్నేళ్ల క్రితం మృతి చెందారు. తదననంతరం ఆయన వారసుడైన రాజా కృష్ణదేవరావు ప్రతి ఏటా దసరా పండగ ముందు వనపర్తికి వచ్చి ఇక్కడే నివాసం ఉంటూ దేవీనవరాత్రి ఉత్సవాలు చేస్తారు.  కానీ ఎప్పుడూ.. ఏ విషయంలోనూ శాంతా రామేశ్వర్‌రావు తమ్ముడుగానీ, ఆయన కుటుంబ సభ్యులుగానీ వనపర్తికి వచ్చినట్లు తమకు తెలియదని ట్రస్టు సిబ్బంది తెలిపారు.

వనపర్తి సంస్థానాన్ని ఇండియన్ యూనియన్‌లో విలీనం చేసిన తర్వాత వనపర్తి చివరి రాజు రాజా రామేశ్వర్‌రావు తన నివాసాన్ని హైదరాబాద్‌కు మార్చారు. నాటి నుంచి నేటి వరకు అత్యవసర సమయాల్లో తప్పా వనపర్తికి వచ్చేవారు కాదు.

మరిన్ని వార్తలు