లెక్కచేయకుండా చింపేశాడు

27 May, 2015 20:00 IST|Sakshi
లెక్కచేయకుండా చింపేశాడు

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ బుధవారం కొన్ని అభ్యంతరకర దృశ్యాలకు వేదికగా నిలిచింది. లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలను స్పష్టం చేస్తూ కేంద్ర హోంత్రిత్వశాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ పత్రాలను ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే చింపి ముక్కలుముక్కలు చేశారు. ఇది పలు విమర్శలకు దారి తీసింది. నియమకాలు, బదిలీల విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్కు కొన్ని విశిష్ట అధికారాలున్నాయని స్పష్టం చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఈ అంశంపైనే చర్చించేందుకు అత్యవసరంగా కొలువుదీరిన అసెంబ్లీలో మహేంద్ర గోయల్ అనే ఎమ్మెల్యే ఒక్కసారిగా కేంద్రంపై విరుచుకుపడ్డారు. తన నియంతృత్వ పోకడలతో ఢిల్లీ ప్రభుత్వం నుంచి అధికారాలను లాక్కోవాలని కేంద్రం చూస్తోందని ఆరోపిస్తూ ఒక్కసారిగా కేంద్రం వెలువరించిన నోటిఫికేషన్ ను చింపివేశాడు. కాగా, ఈ చర్యపై కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ ఘాటుగా స్పందించారు. ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఇలా చేస్తే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఇక దేశాన్ని, నగరాన్ని దేవుడే బాగు చేయాలి అన్నారు.

>
మరిన్ని వార్తలు