350కు పైగా లోక్‌సభ స్థానాల్లో పోటీ: ఆప్

31 Jan, 2014 00:21 IST|Sakshi

నేర చరితులపై కచ్చితంగా పోటీచేస్తామని ఉద్ఘాటన
 
 న్యూఢిల్లీ: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తాము 350కుపైగా స్థానాల్లో పోటీచేయనున్నామని ‘ఆమ్ ఆద్మీ పార్టీ’(ఆప్) ప్రకటించింది. నేర రాజకీయాలకు, అవినీతికి చిహ్నాలుగా మారిన కళంకిత అభ్యర్థులను చట్టసభకు రాకుండా చేసేందుకు వారిపై తమ అభ్యర్థులను కచ్చితంగా బరిలోకి దింపుతామని ప్రతిన బూనింది. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంతో సంబంధమున్న ఎ.రాజా సహా 14 మంది కేంద్ర మంత్రులపై తాము పోటీకి దిగుతామని పేర్కొంది. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి మా పార్టీ రాష్ట్ర విభాగాల కన్వీనర్ల నుంచి మాకు నివేదికలు వచ్చాయి.. ఏ స్థానంలో పరిస్థితి ఏంటన్నది పరిశీలిస్తున్నాం’ అని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు సంజయ్ సింగ్ విలేకరులతో చెప్పారు.

 

గురువారమిక్కడ జరిగిన జాతీయ కార్యనిర్వాహక కమిటీ సమావేశానంతరం మాట్లాడుతూ ఆయన ఈ విషయాలు వెల్లడించారు. ‘మాకు తెలిసినంతవరకు క్రిమినల్ కేసులు ఉన్న ఎంపీలు దేశంలో 162 మంది ఉన్నారు. వారిలో 73 మందిపై చాలా తీవ్రమైన నేరాభియోగాలున్నాయి. వీరిపై మా పార్టీ అభ్యర్థులను పోటీకి దింపడానికి చూస్తున్నాం’ అని పేర్కొన్నారు. ఈ కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో.. లోక్‌సభ ఎన్నికలపై ప్రధానంగా చర్చసాగిందన్నారు. ఇందులో ప్రస్తావనకొచ్చిన అంశాలను శుక్రవారం జరుగబోయే జాతీయ మండలి సమావేశంలో చర్చిస్తామని వివరించారు.
 

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా