అగ్ని-5పై యూఎన్ లో.. :చైనా

27 Dec, 2016 21:38 IST|Sakshi
అగ్ని-5పై యూఎన్ లో.. :చైనా
బీజింగ్: భారత్ పరీక్షించిన అగ్ని-5 క్షిపణిపై యూఎన్ కౌన్సిల్లో ప్రశ్నిస్తామని చైనా స్పష్టం చేసింది. చైనా యూఎన్ శాశ్వత సభ్యత్వం కలిగిన దేశం. అణు శక్తి పదార్ధాలను ప్రయోగించగలిగే ఆయుధాలను తయారుచేయడంపై భారత్ కు యూఎన్ కొన్ని సూచనలు చేసిందని చైనీస్ విదేశాంగ శాఖ ప్రతినిధి హువా చున్యుంగ్ పేర్కొన్నారు. జపాన్, భారత మీడియాల్లో అగ్ని-5 చైనాకు చెక్ పెడుతుందనే వార్తలపై ఆమె మాట్లాడారు. 
 
మీడియా కథనాల వెనుక ఉన్న ఉద్దేశాన్ని తెలుసుకోవాలని అనుకుంటున్నామని, భారత విదేశాంగ శాఖతో ఈ విషయంపై మాట్లాడతామని తెలిపారు. ఆసియా, యూరప్ ఖండాల్లోని చాలా ప్రాంతాలను అగ్ని-5 చేరుకోగలదని చైనా-పాక్ లకు ఇది చెక్ పెడుతుందని మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. పొరుగుదేశాలతో చైనా శాంతిని పాటించాలని భావిస్తున్నట్లు ఆమె చెప్పారు. చైనా-భారత్ లు విరోధులు కావని భాగస్వాములని రెండు దేశాలు ఒప్పుకున్న విషయాన్ని గుర్తు చేశారు.
>
మరిన్ని వార్తలు